రారండోయ్ వేడుక చూద్దాం ఆడియో రివ్యూ

Monday,May 22,2017 - 04:35 by Z_CLU

నాగ చైతన్య, రకుల్ ప్రీత్ సింగ్ జంటగా నటించిన రారండోయ్ వేడుక చూద్దాం ఆడియో రిలీజ్ అయింది. ఆల్ రెడీ సినిమా ఎప్పుడెప్పుడు చూస్తామా అనే క్యూరాసిటీ లో ఉన్న ఫ్యాన్స్ లో ఎగ్జైట్ మెంట్ మరింత పెంచేస్తుందీ జ్యూక్ బాక్స్. దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్, దానికి తగ్గట్టు శ్రీమణి రాసిన లిరిక్స్. సోషల్ మీడియాని రూల్ చేస్తున్నాయి.

 

రారండోయ్ వేడుక చూద్దాం : ‘బుగ్గ చుక్క పెట్టుకుంది సీతమ్మ సీతమ్మ’ అంటూ బిగిన్ అయ్యే ట్రెడిషనల్ సాంగ్ , స్లో పేజ్ లో అద్భుతంగా ట్యూన్ చేశాడు DSP.  లిరిక్స్ ని బట్టి ఈ సాంగ్ డెఫ్ఫినేట్ గా పెళ్ళి సిచ్యువేషన్ లో ఉండబోతుందనేది కన్ఫం గా తెలిసిపోతుంది. ఈ పాటని రంజిత్, గోపికా పూర్ణిమా పాడారు.

నీ వెంటే నేనుంటే : DSP మార్క్ సాంగ్. సోషల్ మీడియాలో ఇలా రిలీజయిందో లేదో, యూత్ నోట్లో బీట్స్ తో సహా ఈ సాంగ్ వినిపిస్తుందంటే ఈ సాంగ్ కి క్రియేట్ అయిన క్రేజ్ అర్థం చేసుకోవచ్చు. అల్టిమేట్ రొమాంటిక్ ఎసెన్స్ తో ట్యూన్ అయిన ఈ సాంగ్, సినిమాకి వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ ఎసెట్. కపిల్, శ్వేతా మోహన్ ఈ పాటను పాడారు.

భ్రమరాంబకి నచ్చేశాను : ‘మేఘాల్లో డ్యాన్సింగ్ నేను…’ అంటూ బిగిన్ అయ్యే ఈ సాంగ్ ని సాగర్ పాడాడు. సరికొత్త పదాలతో సాగే ఈ సాంగ్, యూత్ కి పక్కా ఆప్ట్. భ్రమరాంబకి నచ్చేశాను అనే సాంగ్ అందరికీ నచ్చేసింది.

బ్రేకప్ : ‘బ్రేకప్ అంటే పండగే బ్రో’ అంటూ బిగిన్ అయ్యే సాంగ్.. అప్పటి వరకు క్లాస్ గా, రొమాంటిక్ గా వెళ్తున్న ట్రాక్ లోకి మాస్ ఎంట్రీ లా ఉంది. ఎగ్జాక్ట్ గా ఏ సిచ్యువేషన్ లో ఈ సాంగ్ ఫ్రీజ్ అయిందో కాస్త గెస్ చేయడం కష్టమే కానీ, జావెద్ ఆలీ పాడిన ఈ బ్రేకప్ సాంగ్ ని యూత్ ఈజీగా హమ్ చేసేస్తున్నారు.

తకిట తకఝమ్ : పాట బిగిన్ అవ్వగానే సరౌండింగ్స్ అన్ని సైలెంట్ మోడ్ లోకి వెళ్ళిపోయేంత ఇంపాక్ట్ ఉంది ఈ సాంగ్ లో. జావేద్ ఆలీ పాడిన ఈ సాంగ్, జస్ట్ యూత్ కే కాదు, మ్యూజిక్ కి కనెక్ట్ అవ్వని వారిని కూడా ఎట్రాక్ట్ చేస్తుంది. ఇలాంటి పాటలు రేర్ గా కంపోజ్ అవుతాయి.

తకిట తకఝమ్ ( రాక్ ) : సిచ్యువేషన్ డిమాండ్ ని బట్టి కంపోజ్ అయిన సాంగ్. ఆల్ మోస్ట్ సెకండాఫ్ లో, సినిమా పీక్ లో ఉన్నప్పుడు సిచ్యువేషనల్ గా ఉండే సాంగ్ అని లిరిక్స్, సాంగ్ మోడ్ ని బట్టి తెలిసిపోతుంది. ఏది ఏమైనా తకిట తకఝం సాంగ్ స్లో పేజ్ లో ఎంత ఎట్రాక్టివ్ గా ఉందో రాక్ స్టైల్ లోను అంతే ఇంప్రెసివ్ గా ఉంది.