బాహుబలి-2 : 3 రోజుల వసూళ్లు

Monday,May 01,2017 - 12:14 by Z_CLU

ఏ సినిమాకైనా మొదటి వీకెండ్ వసూళ్లు చాలా కీలకం. నెక్ట్స్ వీకెండ్ నుంచి ఎంత పెద్ద సినిమాకైనా హైప్ తగ్గుతుంది. అందుకే ఫస్ట్ వీకెండ్ వసూళ్లు నిర్మాతలకు చాలా కీలకం. ఈ విషయంలో బాహుబలి-2 రికార్డు సృష్టించింది. తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా మొదటి 3 రోజుల్లో (ఫస్ట్ వీకెండ్) దుమ్ముదులిపింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో 3 రోజుల్లో ఏకంగా 74 కోట్ల 30లక్షల షేర్ సాదించింది బాహుబలి-2 సినిమా.

బాహుబలి-2… 3 రోజుల షేర్
నైజాం – 19 కోట్లు
సీడెడ్ – 12.50 కోట్లు
ఉత్తరాంధ్ర – 9.28 కోట్లు
ఈస్ట్ – 8.72 కోట్లు
వెస్ట్ – 7.51 కోట్లు
కృష్ణా – 5.25 కోట్లు
గుంటూరు – 8.84 కోట్లు
నెల్లూరు – 3.20 కోట్లు