ఈ వారమే ఉంగరాల రాంబాబు ఆడియో

Monday,May 01,2017 - 11:41 by Z_CLU

సునీల్,  క్రాంతి మాధవ్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమా ఉంగరాల రాంబాలు.  షూటింగ్ కంప్లీట్ చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ స్టేజ్ లో ఉన్న ఈ సినిమాను ఈనెలాఖరుకు విడుదల చేయాలని అనుకుంటున్నారు. ఈ వారంలోనే ఆడియోను మార్కెట్లోకి తీసుకురాబోతున్నారు. యునైటెడ్ కిరిటీ మూవీస్ లిమిటెడ్ బ్యానర్ పై  నిర్మాత పరుచూరి కిరీటి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. సునీల్ సరసన మియా జార్జ్ హీరోయిన్ గా నటిస్తోంది.

మే మొదటి వారంలో జిబ్రాన్ సంగీతమందించిన ఆడియోని విడుద‌ల చేసి… మే చివరి వారంలో సినిమా రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. వందశాతం నవ్వించడమే లక్ష్యంగా ఈ సినిమాను నిర్మించినట్టు దర్శకుడు క్రాంతి మాదవ్ తెలిపారు. కామెడీతో పాటు సినిమాలో తనదైన సందేశం కూడా జోడించామని, ప్రకాష్ రాజ్ పాత్ర సినిమాకే హైలెట్ అవుతుందని అంటున్నాడు.

ఉంగరాల రాంబాబు సినిమాపై సునీల్ చాలా ఆశలు పెట్టుకున్నాడు. ఈ సినిమా కచ్చితంగా తనకు సక్సెస్ అందిస్తుందని గట్టిగా నమ్ముతున్నాడు.