నాగచైతన్య సరసన అనుపమ..?

Friday,May 05,2017 - 11:35 by Z_CLU

అన్నీ అనుకున్నట్టు జరిగితే త్వరలోనే నాగచైతన్యతో మరో సినిమా చేయనుంది బబ్లీ బ్యూటీ అనుపమ పరమేశ్వరన్. తాజాగా వీళ్లిద్దరూ కలిసి ప్రేమమ్ సినిమాలో నటించారు. ఆ మూవీలో చై-అనుపమ ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీకి మంచి మార్కులు పడ్డాయి. దీంతో వెంటనే అనుపమకు మరో ఛాన్స్ ఇచ్చినట్టు తెలుస్తోంది.

వచ్చేనెల నుంచి చందు మొండేటి దర్శకత్వంలో ఓ సినిమా స్టార్ట్ చేయబోతున్నాడు నాగచైతన్య. ఈ సినిమాలోనే అనుపమను హీరోయిన్ గా తీసుకునే ఛాన్స్ ఉంది. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై తెరకెక్కనున్న ఈ సినిమా… జూన్ ఎండింగ్ నుంచి సెట్స్ పైకి వచ్చే ఛాన్స్ ఉంది.

తాజాాగా రారండోయ్ వేడుక చూద్దాం సినిమాను కంప్లీట్ చేశాడు చైతూ. ఈ సినిమా షెడ్యూల్ తాజాగా మున్నార్ లో కంప్లీట్ అయింది. ఈ నెలలోనే సినిమా థియేటర్లలోకి వస్తుంది. మరోవైపు కృష్ణ మరిముత్తు దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు చైతూ. రారండోయ్ సినిమా రిలీజ్ కాగానే చందు మొండేటి సినిమా సెట్స్ పైకి వస్తుంది.