దంగల్ రికార్డ్ ని బ్రేక్ చేసే దిశగా బాహుబలి 2

Thursday,May 11,2017 - 03:38 by Z_CLU

బాహుబలి 2 బ్రేక్ చేసిన రికార్డ్స్ లిస్టులో మరో రికార్డుకి చేరువగా ఉంది. బాలీవుడ్ సినిమా ఇప్పటి వరకు రీచ్ అవ్వని హైయెస్ట్ గ్రాసర్ ని బాహుబలి 2 రీచ్ కానుంది. నిన్న మొన్నటి వరకు 387.35 కోట్ల వసూళ్లతో బాలీవుడ్ హయ్యెస్ట్ గ్రాసర్ గా నిలిచిన దంగల్ ప్లేస్ ని ఆక్యుపై చేసుకునే దిశగా మూవ్ అవుతుంది బాహుబలి 2.

బాలీవుడ్ లో నిన్న ఒక్కరోజే బాహుబలి 2 కలెక్ట్ చేసిన మొత్తం 17 కోట్లు. అల్టిమేట్ విజువల్ ఇమోషనల్ వండర్ గా తెరకెక్కిన ఈ సినిమా, సినిమా రిలీజైన 13 రోజుల తరవాత 376. 75 కోట్ల దగ్గర చేరింది. 13 రోజుల తరవాత  కూడా బాహుబలి 2 కి ఫ్యాన్స్ లో ఏ మాత్రం క్రేజ్ తగ్గకపోవడంతో 400 కోట్ల మార్క్ ని రీచ్ అవ్వడం మరీ కష్టమేం కాదంటున్నాయి ట్రేడ్ వర్గాలు.