ట్రెండింగ్ జోన్ లో కేశవ

Thursday,May 11,2017 - 04:43 by Z_CLU

రివేంజ్ బేస్డ్ కంటెంట్ తో మే 19 న రిలీజ్ కి ఫిక్సయింది కేశవ. ఇప్పటికే రిలీజైన ఫస్ట్ లుక్, టీజర్స్ తో పాటు రీసెంట్ గా రిలీజైన సాంగ్ సోషల్ మీడియాలో మ్యాగ్జిమం స్పేస్ ని ఆక్యుపై చేసుకున్నాడు కేశవ. ఈ సినిమా ఫస్ట్ సింగిల్ ‘కాళభైరవ అష్టకం’ ఇప్పటికే ఇమోషనల్ థ్రిల్లర్స్ ఎంటర్ టైనర్స్ ని ఇష్టపడే వారిలో హై ఎండ్ క్యూరాసిటీ జెనెరేట్ చేయడంలో సక్సెస్ అయింది.

 డిఫెరెంట్ కాన్సెప్ట్స్ తో కరియర్ ని ప్లాన్ చేసుకుంటున్న నిఖిల్, హీరోయిన్ రీతూ వర్మ వీరికి తోడు బాలీవుడ్ బ్యూటీ ఈశా కొప్పీకర్ ఈ సినిమాలో  రోల్ ప్లే చేస్తుందనగానే న్యాచురల్ గానే సినిమాలో కంటెంట్ ఉందని ఫిక్సయిపోయారు ప్రేక్షకులు.

సుధీర్ వర్మ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమా ఆడియోతో పాటు, సరికొత్త ట్రేలర్ ని మే 13 న రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తుంది సినిమా యూనిట్. అభిషేక్ నామా నిర్మించిన ఈ సినిమాకి సన్నీ M.R. మ్యూజిక్ కంపోజ్ చేశాడు.