ఫ్రై డే రిలీజ్

Thursday,May 11,2017 - 03:10 by Z_CLU

ఎవ్రీ ఫ్రై డే లాగే ఈ ఫ్రై డే కూడా సరికొత్త సినిమాలతో గెట్ రెడీ మోడ్ లోకి వచ్చేసింది. తెలుగుతో పాటు అటు బాలీవుడ్, కోలీవుడ్ సినిమాలతో  బాక్సాఫీస్ హీటెక్కనుంది. వాటి వివరాలు…

 

వెంకటాపురం

రాహుల్, మహిమా మక్వాన్ జంటగా గుడ్ సినిమా గ్రూప్ పతాకంపై శ్రేయాస్ శ్రీనివాస్ & తుము ఫణి కుమార్ నిర్మాతలుగా తెరకెక్కుతోన్న సస్పెన్స్ థ్రిల్లర్ వెంకటాపురం ఈ ఫ్రై డే రిలీజ్ కి రెడీగా ఉంది. అల్టిమేట్ సస్పెన్స్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ సినిమాకి వేణు డైరెక్టర్. ఇంటరెస్టింగ్ పోస్టర్స్ తో, ట్రేలర్స్ తో స్పెషల్ ఇంట్రెస్ట్ ని క్రియేట్ చేసిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఎలా పర్ఫాం చేస్తుందో చూడాలి.

రాధ

శతమానం భవతి లాంటి డీసెంట్ హిట్ తరవాత శర్వానంద్ హీరోగా వస్తున్న ‘రాధ’ న్యాచురల్ గానే ఎక్స్ పెక్టేషన్స్  క్రియేట్ చేసింది. లావణ్య త్రిపాఠి హీరోయిన్ గా చంద్రమోహన్ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమా, మే 12న అంటే రేపు  రిలీజవుతుంది. రొమాన్స్, కామెడీ , యాక్షన్ మెయిన్ ఎలిమెంట్స్ గా తెరకెక్కిన ఈ సినిమా సూపర్ హిట్ గ్యారంటీ అని కాన్ఫిడెంట్ గా ఉంది సినిమా యూనిట్.

 

రక్షక భటుడు

ఇంటరెస్టింగ్ పాయింట్ తో తెరకెక్కిన యాక్షన్ ఎంటర్ టైనర్ రక్షకభటుడు. ఇంటరెస్టింగ్ పోస్టర్స్ తో స్పెషల్ ఇంట్రెస్ట్ ని క్రియేట్ చేసిన ఈ సినిమాకి ఈ వంశీ ఆకెళ్ళ డైరెక్టర్. రిచా పనై, బ్రహ్మానందం, బాహుబలి ప్రభాకర్, బ్రహ్మాజీ, సుప్రీత్, అదుర్స్ రఘు, ధనరాజ్ నటించిన ఈ సినిమా  రేపు బాక్సాఫీస్ బరిలోకి దిగుతుంది.

 

సర్కార్ 3

అమితాబ్ బచ్చన్, యామీ గౌతమ్, జాకీ ష్రాఫ్, మనోజ్ బాజ్ పాయ్ లాంటి బాలీవుడ్ దిగ్గజాలు నటించిన యాక్షన్ థ్రిల్లర్ సర్కార్ 3. రామ్ గోపాల్ వర్మ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమా సినీటౌన్ లో ఇప్పటికే హై ఎండ్ క్యూరాసిటీ క్రియేట్ చేసింది. ఈ ఫ్రై డే నుండి రిలీజైన ప్రతి సెంటర్ రూల్ చేయడానికి రిలీజ్ అవుతున్న సర్కార్ 3 బాక్సాఫీస్ దగ్గర ఏ రేంజ్ లో ఎట్రాక్ట్ చేస్తుందో చూడాలి.

 

శరవణన్ ఇరుక్క బయమేన్

ఉదయనిధి స్టాలిన్, రెజీనా జంటగా తెరకెక్కిన తమిళ మూవీ ‘శరవణన్ ఇరుక్క బయమేన్’. ఎజిల్ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమా D. ఇమ్మన్ మ్యూజిక్ కంపోజ్ చేశాడు. ఇప్పటికే పాజిటివ్ టాక్ ని బ్యాగ్ లో వేసుకున్న ఈ సినిమా అవుట్ అండ్ అవుట్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కినట్టు తెలుస్తుంది. ఈ సినిమా కూడా ఫ్రై డే నుండే థియేటర్స్ లో సందడి బిగిన్ చేయనుంది.