అవసరాల నయా స్కెచ్

Wednesday,October 05,2016 - 08:00 by Z_CLU

వరుసగా రెండు హిట్స్ అందుకున్నాడు అవసరాల. కమెడియన్ గా ఇండస్ట్రీలోకొచ్చిన ఈ నటుడు.. ఊహలు గుసగుసలాడే సినిమాతో దర్శకుడయ్యాడు. తాజాగా జ్యో అచ్యుతానందతో మరో క్లీన్ హిట్ అందుకున్నాడు. దీంతో అవసరాలపై అందరి కన్నుపడింది. ప్రస్తుతానికి అవసరాల 2 సినిమాలకు కమిట్ అయ్యాడు. వాటిలో వెంకీ సినిమా కూడా ఉందనే టాక్ నడుస్తోంది.

collage

      నెక్ట్స్ ప్రాజెక్టుగా తన బెస్ట్ ఫ్రెండ్ నానితో ఓ సినిమా ప్లాన్ చేస్తున్నాడు అవసరాల. తన స్టయిల్ లోనే కూల్ గా, కామెడీ టచ్ తో ఉండబోతోంది ఈ మూవీ. వారాహి చలనచిత్ర బ్యానర్ పై ఈ సినిమా ఉంటుంది. దీని తర్వాత విక్టరీ వెంకటేష్ తో ఓ సినిమా చేయబోతున్నాడట అవసరాల. ప్రస్తుతం చర్చల దశలోనే ఈ ప్రాజెక్టు ఉంది. వెంకీ చేస్తున్న గురు ప్రాజెక్టు కంప్లీట్ అయిన వెంటనే… అవసరాల-వెంకీ సినిమాపై ఓ క్లారిటీ వస్తుంది.