ధృవ టీజర్ రెడీ..?

Tuesday,October 04,2016 - 05:46 by Z_CLU

చెర్రీ సినిమా దసరాకు వస్తుందని అంతా అనుకున్నారు. కానీ కొద్దిరోజుల కిందటే తమ సినిమా దసరాకు రావడం లేదని.. డిసెంబర్ లో వస్తుందని నిర్మాత అల్లు అరవింద్ ప్రకటించారు. దీంతో మెగాఫ్యాన్స్ కాస్త డిసప్పాయింట్ అయ్యారు. అభిమానుల్లో అసంతృప్తిని చెర్రీ కూడా అర్థం చేసుకున్నాడు. అందుకే దసరాకు సినిమాను విడుదల చేయకపోయినా… టీజర్ తో ఫ్యాన్స్ కు పండగ తీసుకురావాలని ఫిక్స్ అయ్యాడు. అన్నీ అనుకున్నట్టు జరిగితే ఈ దసరాకు ధృవ ఫస్ట్ లుక్ టీజర్ విడుదలకానుంది.

     ప్రస్తుతం ధృవ సినిమా షూటింగ్ క్లయిమాక్స్ కు చేరుకుంది. ఓ 6 రోజుల టాకీ, 2 పాటలు మినహా షూటింగ్ మొత్తం పూర్తయింది. త్వరలోనే ఆడియో విడుదల చేసి… డిసెంబర్ లో సినిమాను గ్రాండ్ గా థియేటర్లలోకి తీసుకురావాలని అనుకుంటున్నారు. రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకు సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నాడు.