అన్నయ్య తో తమ్ముడు...

Wednesday,October 05,2016 - 09:00 by Z_CLU

 మెగాస్టార్ చిరంజీవిని ఆదర్శంగా తీసుకొని టాలీవుడ్ లో నటులుగా ఎంట్రీ ఇచ్చిన వాళ్ళల్లో సునీల్ కూడా ఒకడు. ఈ విషయాన్ని ఎన్నో సందర్భాల్లో చెప్పుకొచ్చాడు సునీల్. తాజాగా జక్కన్న ఆడియో వేడుక లో కూడా చిరు పై తనకున్న అభిమానాన్ని చాటుకున్నాడు ఈ హీరో.

ఇక కామెడీ పాత్రలకు ఎప్పుడో గుడ్ బై చెప్పి హీరో గా కొనసాగుతున్న సునీల్ ను ఇటీవలే మెగా స్టార్ ‘ఖైదీ నెం 150’ లో ఓ పాత్ర వరించింది. అయితే కొన్ని కారణాల వల్ల ఈ పాత్ర ను సునీల్ మిస్ చేసుకున్నాడు. మొన్నటి వరకూ సునీల్ ఈ సినిమాలో నటించకపోవడానికి కారణం ఏమిటా అని అనుకున్నారంతా.. బహుశా హీరోగా కొనసాగుతుండడమే ఇందుకు కారణం అనే టాక్ కూడా వినిపించింది. ఎట్టకేలకు ఈ విషయం పై సునీల్ క్లారిటీ ఇచ్చాడు.

siv_92790003-1

‘ఈడు గోల్డ్ ఎహే’ విడుదల సందర్భంగా ప్రమోషన్ లో పాల్గొన్న సునీల్.. ఈ అంశంపై స్పందించాడు. అన్నయ్య సినిమాలో ఓ పాత్ర చెయ్యాల్సి ఉంది కానీ ప్రస్తుతం హీరోగా 3 సినిమాలు చేస్తుండడంతో చేయలేకపోయా… ఆ పాత్రే అలి గారు చేస్తున్నారని చెప్పుకొచ్చాడు. ఇప్పుడు మిస్ అయినా భవిష్యత్ లో చిరంజీవితో కలిసి నటించే అవకాశం వస్తే ఎట్టిపరిస్థితుల్లో వదులుకోనంటున్నాడు సునీల్.