నెలకో సూపర్ హిట్ తో టాలీవుడ్ బాక్సాఫీస్ కళకళలాడుతోంది. అక్టోబర్ నెలలో కూడా టాలీవుడ్ సక్సెస్ లు చూసింది. దసరా, దీపావళి లాంటి ఫెస్టివల్స్ కూడా యాడ్ అవ్వడంతో బాక్సాఫీస్ లో కాసుల వర్షం కురిసింది.

ఫస్ట్ వీక్ లో దసరా ఎట్రాక్షన్ గా గాడ్ ఫాదర్ (God Father), ది ఘోస్ట్, స్వాతిముత్యం సినిమాలు రిలీజ్ అయ్యాయి. వీటిలో చిరంజీవి హీరోగా నటించిన గాడ్ ఫాదర్ సినిమా హిట్టయింది. బెల్లంకొండ గణేశ్ హీరోగా పరిచయమైన స్వాతిముత్యం కూడా హిట్ టాక్ తెచ్చుకుంది.

రెండో వారంలో గీత, కాంతార (Kantara), క్రేజీ ఫెలో, రుద్రనేత్రి, నీతో, రారాజు, నా వెంట పడుతున్న చిన్నవాడెవడమ్మా, అడవి (రీ-రిలీజ్), రెబల్ (రీ-రిలీజ్), బాయ్ ఫ్రెండ్ ఫర్ హయర్, నిన్నే పెళ్లాడతా సినిమాలు రిలీజ్ అయ్యాయి. వీటిలో రక్షిత్ శెట్టి నటించిన కాంతార సినిమా సూపర్ హిట్ గా నిలిచింది.

మూడో వారంలో దీపావళి కానుకగా ఓరి దేవుడా, సర్దార్ (Sardar), ప్రిన్స్, జిన్నా, బిల్లా (రీ-రిలీజ్) సినిమాలు రిలీజ్ అయ్యాయి. వీటిలో కార్తి నటించిన సర్దార్ సినిమా బ్లాక్ బస్టర్ అనిపించుకుంది. విశ్వక్ నటించిన ఓరి దేవుడా సినిమా కూడా సక్సెస్ అయింది.

ఇక అక్టోబర్ కు ఫినిషింగ్ టచ్ ఇస్తూ.. ఫోకస్, రుద్రవీణ, అనుకోని ప్రయాణం, ఐడెంటిటీ, తీహార్ కాలేజ్ సినిమాలు రిలీజ్ అయ్యాయి. ఈ సినిమాలేవీ బాక్సాఫీస్ పై ప్రభావం చూపించలేకపోయాయి. రాజేంద్రప్రసాద్ నటించిన అనుకోని ప్రయాణం సినిమాకు మంచి రివ్యూస్ వచ్చినప్పటికీ, రెవెన్యూస్ మాత్రం లేవు.
అలా అక్టోబర్ నెలలో 28 సినిమాలు రిలీజ్ అయితే.. వాటిలో కాంతార, సర్దార్, గాడ్ ఫాదర్, ఓరి దేవుడా సినిమాలు సక్సెస్ అయ్యాయి. నవంబర్ లో ఈ హిట్ ట్రాక్ ను ఏ సినిమాలు కొనసాగిస్తాయో చూడాలి.
– Follow us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending stories, Gossips, Actress Photos and Special topics