ఫ్యాన్స్ ప్రశ్నలు.. సూపర్ స్టార్ సమాధానాలు

Wednesday,October 31,2018 - 01:01 by Z_CLU

మరో వినూత్న కార్యక్రమాన్ని స్టార్ట్ చేసింది 2.0 యూనిట్. అదే AskTeam2Point0 కంటెస్ట్. ఇప్పటివరకు ఎవరూ చేపట్టని సరికొత్త కార్యక్రమం ఇది. ఇందులో భాగంగా సినిమాకు సంబంధించి ఎలాంటి క్వశ్చన్స్ అయినా మీరు నేరుగా సూపర్ స్టార్ ను అడిగేయొచ్చు. కేవలం రజనీనే కాదు, యూనిట్ లో ఎవరినైనా మీరు ప్రశ్నించొచ్చు.

అలా వచ్చిన ప్రశ్నల్లో కొన్ని ఎంపికచేసి, వాటికి యూనిట్ సభ్యులు సమాధానాలిస్తారు. నవంబర్ 3న జరగనున్న 2.0 ట్రయిలర్ లాంచ్ వేదికపై ఈ కార్యక్రమం ఉంటుంది. అభిమానులు కేవలం ప్రశ్నలు అడగడం మాత్రమే కాకుండా.. సినిమాకు సంబంధించి ప్రశంసలు, రిమార్క్స్, డౌట్స్.. ఇలా ఏదైనా షేర్ చేసుకోవచ్చు.

ఇండియాలోనే అత్యంత భారీ బడ్దెట్ చిత్రంగా, శంకర్ దర్శకత్వంలో రూపుదిద్దుకుంది 2.0 సినిమా. టాప్ క్లాస్ టెక్నీషియన్స్ వర్క్ చేసిన ఈ సినిమాలో ఎమీ జాక్సన్ హీరోయిన్ గా నటించగా, బాలీవుడ్ సూపర్ స్టార్ అక్షయ్ కుమార్ విలన్ గా కనిపించబోతున్నాడు. నవంబర్ 29న వరల్డ్ వైడ్ గ్రాండ్ గా రిలీజ్ కాబోతోంది 2.0.