రజనీ నెక్ట్స్ టార్గెట్ న్యూజెర్సీ

Friday,June 30,2017 - 02:29 by Z_CLU

సినిమా ప్రమోషన్ లో సరికొత్త ట్రెండ్ సృష్టిస్తోంది 2.0 సినిమా యూనిట్. తమ ప్రచారానికి 2.0 వరల్డ్ టూర్ అని పేరుపెట్టిన రజనీకాంత్ టీం.. ఏకంగా హాలీవుడ్ నుంచి తమ ప్రమోషనల్ హంగామా షురూ చేసింది. లాస్ ఏంజెలెస్ లోని హాలీవుడ్ స్టుడియో సమీపంలో భారీ హాట్ ఎయిర్ బెలూన్ ఎగరేశారు. ఇప్పుడు తమ నెక్ట్స్ టార్గెట్ గా న్యూజెర్సీని ఫిక్స్ చేశారు.

వచ్చేనెల 28 నుంచి 3 రోజుల పాటు న్యూజెర్సీలో క్విక్ ఛెక్ ఫెస్టివల్ పేరిట లోకల్ కార్నివాల్ ఒకటి జరగబోతోంది. ఆ కార్నివాల్ లో 2.0కు ప్రమోషన్ కల్పించాలని నిర్ణయించారు. అయితే హాలీవుడ్ లో చేసినట్టు హాట్ ఎయిర్ బెలూన్ ఎగరేస్తారా..లేక మరో సరికొత్త ప్రచారాన్ని తెరపైకి తెస్తారా అనేది వేచి చూడాలి

దాదాపు 400 కోట్ల రూపాయల భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న 2.0 సినిమాకు ప్రచారం కల్పించేందుకు ఏకంగా 40 కోట్ల రూపాయలు కేటాయించారు. ప్రపంచవ్యాప్తంగా కీలకమైన అన్ని లొకేషన్లలో పర్యటించాలని నిర్ణయించారు. అందుకే దాదాపు 6 నెలల ముందు నుంచే 2.0 సినిమాకు ప్రచారం మొదలుపెట్టారు. వచ్చే ఏడాది జనవరి 25న ఈ సినిమా థియేటర్లలోకి రానుంది.