ఒకే రోజు 10వేల స్క్రీన్స్ పై 2.0 రిలీజ్

Wednesday,November 21,2018 - 02:00 by Z_CLU

ఇండియాలో ఇప్పటివరకు బిగ్గెస్ట్ రిలీజ్ ఏది? మొన్నటివరకు ఈ రికార్డు బాహుబలి-2 సినిమా పేరిట ఉండేది. అంతకంటే ముందు సల్మాన్ ఖాన్ పేరిట ఈ రికార్డు ఉండేది. ఇకపై ఈ రికార్డు రజనీకాంత్ సొంతం. అవును.. సూపర్ స్టార్ నటించిన 2.0 సినిమా ప్రపంచవ్యాప్తంగా 10వేల స్క్రీన్స్ పై విడుదలకు సిద్ధమౌతోంది.

ఈనెల 29న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా విడుదలకానున్న ఈ సినిమా కోసం ఇప్పటికే వరల్డ్ వైడ్ 9వేల స్క్రీన్స్ లాక్ అయ్యాయి. రిలీజ్ టైమ్ కు ఈజీగా మరో 1500 స్క్రీన్స్ బుక్ అవుతాయి. ఇలా ఒకేరోజు 10వేల కంటే ఎక్కువ స్క్రీన్స్ పై గ్రాండ్ గా విడుదలవుతోంది 2.0.

వరల్డ్ వైడ్ స్క్రీన్ కౌంట్ (సుమారుగా)
తమిళనాడు – 850
ఏపీ+నైజాం – 1200
కర్ణాటక – 700
కేరళ – 500
నార్త్ ఇండియా – 3000
ఓవర్సీస్ – 3000