ట్రైలర్ తో ఎట్రాక్ట్ చేస్తున్నయాక్ష‌న్ కింగ్

Monday,June 26,2017 - 10:10 by Z_CLU

యాక్షన్ కింగ్ అర్జున్ లేటెస్ట్ మూవీ ‘కురుక్షేత్రం’ ట్రైలర్ తో సోషల్ మీడియా లో సందడి చేస్తున్నాడు. 36 ఏళ్ళ సినీ కెరీర్‌లో ఎన్నో విల‌క్ష‌ణ‌మైన క్యారెక్టర్స్ తో ఎంటర్టైన్ చేసిన యాక్ష‌న్ కింగ్ అర్జున్ కి ఇది చాలా ప్రత్యేకమైన సినిమా. నటుడిగా కురుక్షేత్రం సినిమాతో 150వ మెయిలు రాయిని చేరుకున్నాడు. అర్జున్ ఇమేజ్ కు అనుగుణంగా.. అత్యంత స్టైలిస్డ్ యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కుతోన్న ఈ మూవీ టీజర్‌ను విడుదల ఇటీవలే చేశారు. పోలీస్ ఆఫీస‌ర్ల జీవితాల్లో మ‌రో కోణం..స్క్రీన్‌ప్లే హైలెట్‌ గా తెరకెక్కుతున్న ఈ సినిమా తెలుగుతో పాటు తమిళ్, కన్నడలో విడుదల చేయబోతున్నారు.

అరుణ్ వైద్యనాథన్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమా ట్రైలర్ ప్రెజెంట్ అందరినీ ఆకట్టుకుంటూ సినిమా పై అంచనాలు పెంచేస్తుంది. అర్జున్ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా నటిస్తున్న ఈ స్టైలిష్ యాక్షన్ థ్రిల్లర్ త్వరలోనే థియేటర్స్ లో సందడి చేయనుంది. మరి అర్జున్ 150 వ సినిమాగా రూపొందుతున్న కురుక్షేత్రం బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి హిట్ అందుకుంటుందో చూడాలి..