'రాజు గారి గది2' రిలీజ్ డేట్

Monday,June 26,2017 - 11:10 by Z_CLU

ఓంకార్ డైరెక్షన్ లో నాగార్జున నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘రాజు గారి గది2’. రాజు గారి గది సినిమాకు సీక్వెల్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో నాగ్ కథానాయకుడిగా నటిస్తుండడం, సమంత కీలక పాత్ర చేస్తుండడంతో ఈ సినిమా అందరినీ ఎట్రాక్ట్ చేస్తూ క్రీజీ ప్రాజెక్ట్ గా మారింది. నాగార్జున ఓ డిఫరెంట్ క్యారెక్టర్ లో కనిపించబోతున్న ఈ సినిమాను పి.వి.పి నిర్మిస్తుండగా థమన్ సంగీతం అందిస్తున్నాడు.

షూటింగ్ ఫైనల్ స్టేజి కి చేరుకున్న ఈ సినిమాను ఆగస్టు 25 న రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు మేకర్స్. మొదట ఈ సినిమాను సమ్మర్ లో రిలీజ్ చేయాలనుకున్న మేకర్స్ షూటింగ్ బాలన్స్ ఉండటంతో ఫైనల్ గా ఆగస్టు లో రిలీజ్ ప్లాన్ చేసుకున్నారు. సస్పెన్స్ థ్రిల్లర్ గా రూపొందుతున్న ఈ సినిమా ఆగస్టు లో థియేటర్స్ లో సందడి చేయనుందన్నమాట.