అరవింద సమేత.. కౌంట్ డౌన్ స్టార్ట్

Friday,October 05,2018 - 11:41 by Z_CLU

ఈ ఏడాది మోస్ట్ ఎవెయిటింగ్ మూవీస్ లో ఒకటి అరవింద సమేత. చాన్నాళ్లుగా ఈ సినిమా కోసం ఎదురుచూస్తున్న ప్రేక్షకులకు ఆ టైం రానే వచ్చింది. అరవింద సమేతకు కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది. సరిగ్గా మరో 6 రోజుల్లో, దసరా కానుకగా థియేటర్లలోకి రానుంది అరవింద సమేత.

ఈ సినిమాకు సంబంధించి థియేట్రికల్ ట్రయిలర్ రాకముందు ఒకెత్తు. ట్రయిలర్ విడుదలైన తర్వాత మరో ఎత్తు. అంతలా ట్రయిలర్ తర్వాత అరవింద సమేత చిత్రంపై అంచనాలు పెరిగిపోయాయి. గంట గంటకు
యూట్యూబ్ లో ఈ ట్రయిలర్ కు వస్తున్న రెస్పాన్స్ చూస్తే, ప్రేక్షకులు సినిమా కోసం ఎంతలా వెయిట్ చేస్తున్నారో అర్థమౌతోంది.

ఎన్టీఆర్-త్రివిక్రమ్ ఫ్రెష్ కాంబోలో రాబోతున్న ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే ప్రీ-రిలీజ్ ఫంక్షన్ గ్రాండ్ గా జరిగింది. ప్రస్తుతం రిలీజ్ ప్రిపరేషన్స్ లో ఉన్న ఈ మూవీ, ప్రీ-రిలీజ్ బిజినెస్ లో ఇప్పటికే రికార్డులు సృష్టించింది.