అరవింద సమేత.. మరో 3 రోజుల్లో రిలీజ్

Monday,October 08,2018 - 11:35 by Z_CLU

ఎన్టీఆర్-త్రివిక్రమ్ కాంబోలో తెరకెక్కిన మోస్ట్ ఎవెయిటింగ్ మూవీ అరవింద సమేత, మరో 3 రోజుల్లో థియేటర్లలోకి రాబోతోంది. ఈ సినిమాపై భారీగా అంచనాలున్నాయి. ఇంకా చెప్పాలంటే, ఈ ఏడాది మోస్ట్ ఎవెయిటింగ్ మూవీస్ లో టాప్ ప్లేస్ దీనిదే.

అలా భారీ అంచనాల మధ్య గురువారం థియేటర్లలోకి వస్తోంది అరవింద సమేత. మూవీకి సంబంధించి ప్రస్తుతం యూనిట్ అంతా ప్రచారంలో మునిగిపోయింది. ఎన్టీఆర్, త్రివిక్రమ్ కలిసి ఇప్పటికే ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియాకు వరుసపెట్టి ఇంటర్వ్యూలు ఇస్తున్నారు.

మరోవైపు సోషల్ మీడియాలో కూడా అరవింద సమేతపై భారీస్థాయిలో డిస్కషన్ నడుస్తోంది. పెనిమిటి సాంగ్ తో పాటు అనగనగనగా సాంగ్ హిట్ అవ్వడంతో మూవీపై అంచనాలు పెరిగాయి.