మరిన్ని రికార్డులు సృష్టించిన 'అరవింద' ట్రయిలర్

Friday,October 05,2018 - 11:46 by Z_CLU

సోషల్ మీడియాలో అరవింద సమేత ట్రయిలర్ సంచలనాలు కొనసాగుతూనే ఉన్నాయి. గంటగంటకు వేల సంఖ్యలో ఈ ట్రయిలర్ కు హిట్స్, లైక్స్ వస్తున్నాయి. అలా విడుదలైన 48 గంటల్లోనే కోటి వ్యూస్ కొల్లగొట్టింది అరవింద సమేత ట్రయిలర్. టాలీవుడ్ చరిత్రలోనే కాదు, టోటల్ సౌత్ లోనే ఇదొక చెక్కుచెదరని రికార్డుగా నిలిచిపోతుంది.

గతంలో బాహుబలి-2 ట్రయిలర్ మాత్రమే ఇలా తక్కువ టైమ్ లో కోటి వ్యూస్ సంపాదించగలిగింది. మళ్లీ ఇన్నాళ్లకు అరవింద సమేత ట్రయిలర్ మాత్రమే అతి తక్కువ టైమ్ లో ఇలా కోటి 10 లక్షల వ్యూస్ కు రీచ్ అయింది. ఇక లైక్స్ పరంగా చూస్తే 48 గంటల వ్యవథిలో బాహుబలి-2 కంటే అరవింద సమేతకే ఎక్కువ లైక్స్ వచ్చాయి.

మరో ముఖ్యమైన విషయం ఏంటంటే.. 48 గంటలు గడిచినా ఈ ట్రయిలర్ ఇంకా యూట్యూబ్ లో నంబర్ వన్ ట్రెండింగ్ లో కొనసాగుతోంది. సాధారణంగా యూట్యూబ్ లో 12 గంటలకు మించి ఏదీ టాప్ ట్రెండింగ్ లో ఉండదు. అలాంటిది 2 రోజులైనా అరవింద ట్రయిలర్ కు సోషల్ మీడియాలో క్రేజ్ తగ్గకపోవడం గ్రేట్.