త్రివిక్రమ్ ఇంటర్వ్యూ

Tuesday,October 09,2018 - 03:42 by Z_CLU

దర్శకుడు త్రివిక్రమ్ ‘అరవింద సమేత’ సక్సెస్ విషయంలో చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాడు. అక్టోబర్ 11 న గ్రాండ్ రిలీజ్ కి రెడీ అవుతున్న ఈ సినిమాని సెట్స్ పైకి తీసుకురాక ముందే చాలా గ్రౌండ్ వర్క్ చేశానని చెప్పిన ఈ దర్శకుడు, ఈ సినిమా గురించి మరిన్ని విషయాలు షేర్ చేసుకున్నాడు. అవి మీకోసం…

ఆయన గొప్పతనం…

హరికృష్ణ గారి ఇన్సిడెంట్ తరవాత అసలు NTR గారితో నెక్స్ట్ షూటింగ్ గురించి అసలు మాట్లాడనే లేదు. రిలీజ్ పోస్ట్ పోన్ అని ఫిక్సయి ఉన్నాం. అలాంటిది రెండో రోజు ఆయనే కాల్ చేశారు. ఫస్ట్ డే ఆల్మోస్ట్ ఆయనతోనే ఉన్నాం. నెక్స్ట్ డే రాత్రి కాల్ చేసి 3 రోజులు నేను బయటికి రాకూడదు. కానీ 4 రోజు నేను షూటింగ్ వస్తాను… ఇప్పటికే 3 రోజులు వెనక పడ్డాం అన్నారు. అదీ ఆయన డెడికేషన్, గొప్పతనం.

సింబలైజ్ చేశాం…

హీరో మదర్ రోల్ ని అక్కడున్న అందరు ఆడవాళ్ళతో సింబలైజ్ చేశాం. సాధారణంగా ఇంట్లో ఆడవాళ్ళ సజెషన్స్ ని ఎవరూ కన్సిడర్ చేయరు… చేస్తే ఎలా ఉంటుంది..? కొన్ని వయలెంట్ సిచ్యువేషన్స్ ఆడవాళ్లే లీడ్ చేస్తే ఎలా ఉంటుంది అనేది ఈ సినిమాలో తెలుస్తుంది.

కొత్త అందాలు…

రాయలసీమ బ్యాక్ డ్రాప్ లో, ముఖ్యంగా ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో చాలా సినిమాలు వచ్చాయి. కానీ అరవింద సమేతలో రాయలసీమని, అక్కడి కల్చర్ ని మరింత అందంగా ప్రెజెంట్ చేశాం.

రీసర్చ్ చేశాం…

ఈ సినిమా అనుకున్నప్పుడే చాలా విషయాలు తీసుకోవాల్సి ఉందని గ్రహించా. అందుకే తనికెళ్ళ భరణి గారిని కలిసి మనసులో మాట చెప్పుకున్నప్పుడు ఆయన ‘హంపి నుండి హరప్పా దాకా’ అనే పుస్తకం ఇచ్చారు. తిరుమల రామచంద్ర గారు రాసిన పుస్తకమది. అది చదివాకే ఈ సినిమా రాయడం మొదలుపెట్టాను. దాంతో పాటు పెంచలయ్య గారి హెల్ప్ తీసుకున్నాను.

కొత్త యాంగిల్…

ఇప్పటి వరకు ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో చాలా కథలొచ్చాయి కానీ, ఈ యాంగిల్ లో రాలేదు. ఎక్కడైనా ఒక  పోరాటం గురించి డిస్కస్ చేయడం జరుగుతుంది. దానికన్నా ముందు ఉన్న పరిస్థితులను గురించి డిస్కస్ చేయడం జరుగుతుంది. కానీ ఆ పోరాటం ముగిసిన తరవాత ఆ కుటుంబాల పరిస్థితి ఏంటనేది ఎక్కడా డిస్కస్ చేయడం జరగలేదు. ఆ ప్రయత్నం ఈ సినిమాలో చేశాం.

సుప్రియా పాఠక్…

NTR గారికి నానమ్మ రోల్ అనగానే NTR గారు ఇమ్మీడియట్ గా సుప్రియా గారిని రిఫర్ చేశారు. ఆవిడకు కాల్ చేయగానే ఓకె అనేశారు. సమస్యల్లా లాంగ్వేజె. ఆవిడ స్క్రిప్ట్, స్క్రిప్ట్ తో పాటు మనిషిని పంపాలన్నారు. అలా ప్రతి డైలాగ్ నేర్చుకుని మరీ సెట్స్ పైకి వచ్చారావిడ. అంత స్ట్రిక్ట్.

అరవింద…

నానమ్మ చెప్తుంది గొడవలు ఆపమని… మహా అయితే ప్రేమతో ఆపమని చెప్పి ఉండొచ్చు.. కానీ ఎప్పుడైతే హీరోయిన్ నోట వెంట కూడా అలాంటి మాటే వింటాడో.. ఆలోచిస్తాడు.. నిజానికి ఆగిపోతాడు. అందుకే అక్కడ అరవింద రోల్ ఇంపార్టెంట్.

తమన్ గురించి..

తమన్ కి సినిమా సెకండ్ నేచర్. ఇందులో సాంగ్స్ ఎలా ఉండాలో బిగినింగ్ లోనే క్లియర్ గా చెప్పా.. డ్యాన్స్ నంబర్లు అస్సలు ఉండవు, మళ్ళీ నువ్వు మధ్యలో పెడదాం అని కూడా అడగొద్దు… అని చెప్పా…

NTR టెక్నిక్…

NTR తో చాలా తొందరగా సినిమా చేసేయొచ్చు. ఆయన టెక్నిక్ ఏంటంటే కథను చాలాసార్లు వింటాడు. ఎప్పుడూ ఆ కథ గురించి మాట్లాడుతూనే ఉంటాడు. దాని వల్ల ఒక సీన్ చేయాల్సి వచ్చినప్పుడు కానీ, డైలాగ్ చెప్పాల్సి వచ్చినప్పుడు అప్పుడే విన్న ఫీలింగ్ తనకు ఉండదు కాబట్టి, పని ఈజీగా అయిపోతుంది.

పెంచల్ దాస్…

మేము చాలా మంది రాయలసీమ వాళ్ళను కలిశాం కానీ నిజానికి వాళ్లకు రాయలసీమ గురించి తెలీదు. పెంచల్ దాస్ గారి విషయం వేరు. ఆయన రాయలసీమ వాడు మాత్రమే కాదు. ఒక్కోసారి ఆయనలోనే రాయలసీమ ఉందా అనిపిస్తుంది.

అలా ప్లాన్ చేసుకున్నా…

నేను మామూలుగా మొత్తం కథ రాసుకున్న తరవాత పెంచల్ దాస్ గారి సహాయంతో, దాని ప్రెజెంటేషన్ మార్చాం.  దాని వల్ల నేను రాసుకున్న సిచ్యువేషన్స్ కి మరింత అందం ఆడ్ అయింది.