రేపే అరవింద సమేత ప్రీ-రిలీజ్ ఫంక్షన్
Monday,October 01,2018 - 12:54 by Z_CLU
ఎన్టీఆర్-త్రివిక్రమ్ క్రేజీ కాంబోలో తెరకెక్కుతున్న సినిమా అరవింద సమేత. ఈ సినిమా ప్రీ-రిలీజ్ ఫంక్షన్ కు కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది. రేపు సాయంత్రం హైదరాబాద్ లో ప్రీ-రిలీజ్ ఫంక్షన్ గ్రాండ్ గా జరగనుంది. ఈ వేడుకను జీ సినిమాలు ఛానెల్ ప్రత్యక్ష ప్రసారం చేయబోతోంది. రేపు సాయంత్రం 7 గంటల నుంచి జీ సినిమాలు ఛానెల్ లో అరవింద సమేత ప్రీ-రిలీజ్ ఫంక్షన్ ను లైవ్ లో చూసి ఎంజాయ్ చేయండి. ఛానెల్ తో పాటు, జీ సినిమాలు యూట్యూబ్ ఛానెల్, జీ సినిమాలు ఫేస్ బుక్, జీ సినిమాలు.కామ్ వెబ్ సైట్ లో కూడా ప్రీ-రిలీజ్ ఫంక్షన్ అందుబాటులో ఉంటుంది.

అరవింద సమేత ఆడియోకు ఇప్పటికే ట్రెమండస్ రెస్పాన్స్ వస్తోంది. తమన్ సంగీతం అందించిన ఈ సినిమాలో పాటలన్నీ సూపర్ హిట్ అయ్యాయి. ఇప్పుడీ సినిమాకు మరింత బజ్ తీసుకొచ్చేందుకు గ్రాండ్ గా ప్రీ-రిలీజ్ ఫంక్షన్ సెలబ్రేట్ చేయబోతున్నారు.
దసరా ఎట్రాక్షన్ గా అక్టోబర్ 11న అరవింద సమేత సినిమా థియేటర్లలోకి రానుంది. సినిమాలో యంగ్ టైగర్ సరసన పూజా హెగ్డే హీరోయిన్ గా నటించింది.