50 కోట్ల క్లబ్ లో చేరిన అరవింద సమేత

Tuesday,October 16,2018 - 01:10 by Z_CLU

గ్రాండ్ గా 50 కోట్ల క్లబ్ లోకి ఎంటరయ్యాడు యంగ్ టైగర్. ఎన్టీఆర్ నటించిన అరవింద సమేత సినిమా తెలుగు రాష్ట్రాల్లో 50 కోట్ల క్లబ్ లోకి చేరింది. సోమవారం వసూళ్లతో కలుపుకొని ఈ సినిమాకు ఏపీ, నైజాంలో 52 కోట్ల 31 లక్షల రూపాయల షేర్ వచ్చింది.

అటు ఓవర్సీస్ లో కూడా ఈ సినిమా 2 మిలియన్ డాలర్ మార్క్ కు దగ్గరగా ఉంది. మరో 2 రోజుల్లో ఓవర్సీస్ లో ఈ ఘనత అందుకోబోతోంది అరవింద సమేత. త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాతో కెరీర్ లోనే బిగ్గెస్ట్ కలెక్షన్లు సాధిస్తూ, నాన్-బాహుబలి రికార్డులు సృష్టిస్తున్నాడు ఎన్టీఆర్.

ఏపీ, నైజాం 5 రోజుల షేర్
నైజాం – రూ. 15 కోట్లు
సీడెడ్ – రూ. 11.54 కోట్లు
ఉత్తరాంధ్ర – రూ. 5.94 కోట్లు
ఈస్ట్ – రూ. 4.28 కోట్లు
వెస్ట్ – రూ. 3.51 కోట్లు
గుంటూరు – రూ. 6.36 కోట్లు
కృష్ణా – రూ. 3.72 కోట్లు
నెల్లూరు – రూ. 1.96 కోట్లు