అరవింద సమేత 6 రోజుల కలెక్షన్

Wednesday,October 17,2018 - 01:26 by Z_CLU

బ్లాక్ బస్టర్ అరవింద సమేత థియేటర్లలో దూసుకుపోతోంది. వర్కింగ్ డేస్ అయిన సోమ, మంగళవారాల్లో కూడా ఈ సినిమా వసూళ్లు స్టడీగా ఉన్నాయి. నిన్నటితో 6 రోజుల రన్ పూర్తిచేసుకున్న ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో 55 కోట్ల 55 లక్షల రూపాయల షేర్ సాధించింది.

తాజా వసూళ్లతో నైజాంతో పాటు ఏపీలోని పలు ప్రాంతాల్లో బ్రేక్-ఈవెన్ కు దగ్గరైంది అరవింద సమేత సినిమా. దసరా ఫెస్టివల్ ఊపందుకోవడంతో రాబోయే 3 రోజుల్లో ఈ సినిమాకు మరిన్ని కలెక్షన్లు వచ్చే ఛాన్స్ ఉంది. ఆ తర్వాత ఎలాగూ మరో వీకెండ్ వస్తుంది కాబట్టి.. ఈ వారమంతా అరవింద సమేతకు తిరుగులేదు.

ఏపీ,నైజాం 6 రోజుల షేర్
నైజాం – రూ. 15.9 కోట్లు
సీడెడ్ – రూ. 12.48 కోట్లు
ఉత్తరాంధ్ర – రూ. 6.26 కోట్లు
ఈస్ట్ – రూ. 4.51 కోట్లు
వెస్ట్ – రూ. 3.73 కోట్లు
గుంటూరు – రూ. 6.60 కోట్లు
కృష్ణా – రూ. 3.99 కోట్లు
నెల్లూరు – రూ. 2.08 కోట్లు