అరవింద సమేత 3 రోజుల కలెక్షన్

Sunday,October 14,2018 - 12:20 by Z_CLU

బ్లాక్ బస్టర్ హిట్ అయిన అరవింద సమేత సినిమాకు తెలుగు రాష్ట్రాల్లోని అన్ని మేజర్ సెంటర్స్ నుంచి కళ్లుచెదిరే కలెక్షన్లు వస్తున్నాయి. ఫస్డ్ డే వసూళ్లలో ఇప్పటికే కెరీర్ బెస్ట్ రికార్డు క్రియేట్ చేసిన ఎన్టీఆర్, ఇప్పుడు 3 రోజుల వసూళ్లలో కూడా తన మార్క్ చూపిస్తున్నాడు. ఏపీ, నైజాంలో ఈ సినిమాకు 3 రోజుల్లో 41 కోట్ల 70 లక్షల రూపాయల షేర్ వచ్చింది.

ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో సీడెడ్, గుంటూరు, కృష్ణా ఏరియాల్లో నాన్-బాహుబలి రికార్డులు సృష్టించిన అరవింద సమేత.. ఈ వీకెండ్ కంప్లీట్ అయ్యేసరికి చాలా ఏరియాల్లో నాన్-బాహుబలి రికార్డుల్ని స్థాపించబోతోంది.

ఏపీ, నైజాం 3 రోజుల వసూళ్లు (షేర్)

నైజాం – రూ. 11.16 కోట్లు
సీడెడ్ – రూ. 9.13 కోట్లు
ఉత్తరాంధ్ర – రూ. 4.77 కోట్లు
ఈస్ట్ – రూ. 3.64 కోట్లు
వెస్ట్ – రూ. 3 కోట్లు
గుంటూరు – రూ. 5.45 కోట్లు
కృష్ణా – రూ. 3 కోట్లు
నెల్లూరు – రూ. 1.55 కోట్లు