''అరవింద'' నుంచి మోస్ట్ ఎమోషనల్ సాంగ్

Tuesday,October 16,2018 - 12:20 by Z_CLU

సినిమా విడుదల ముందు వరకు అరవింద సమేతలో ఎమోషనల్ సాంగ్ అంటే పెనిమిటి పాట మాత్రమే. కానీ సినిమా రిలీజ్ అయిన తర్వాత అంతకంటే మోస్ట్ ఎమోషనల్ సాంగ్ గా అందర్నీ ఎట్రాక్ట్ చేసింది “రెడ్డమ్మ తల్లి” సాంగ్. మూవీ క్లయిమాక్స్ లో వచ్చే ఆ పాట ఆడియన్స్ హృదయాలకు హత్తుకుంది. ఆ పాటను తాజాగా రిలీజ్ చేశారు.

ఈ సాంగ్ జూక్ బాక్స్ లో లేదు. కేవలం 4 సాంగ్స్ తోనే జూక్ బాక్స్ రిలీజ్ చేశారు. ఇప్పుడు ఈ ఐదో సాంగ్ ను తీసుకొచ్చారు. ఈ పాటను పెంచల్ దాస్ రాయడంతో పాటు తనే స్వయంగా ఆలపించారు. ప్రస్తుతం ఈ పాట యూట్యూబ్ లో ట్రెండింగ్ అవుతోంది.

మరోవైపు అరవింద సమేత సినిమా సక్సెస్ ఫుల్ గా ఫస్ట్ వీకెండ్ పూర్తిచేసుకుంది. సోమవారం నాటి వసూళ్లతో తెలుగు రాష్ట్రాల్లో 50 కోట్ల షేర్ అందుకుంది అరవింద సమేత.