అరవింద సమేత ఫస్ట్ డే కలెక్షన్

Friday,October 12,2018 - 12:14 by Z_CLU

ఊహించిందే జరిగింది. రికార్డులు బద్దలయ్యాయి. సరికొత్త ట్రెండ్ క్రియేట్ అయింది. అరవింద సమేత సినిమాతో ఎన్టీఆర్, తన పాత రికార్డుల్ని తానే బద్దలుకొట్టాడు. తెలుగు రాష్ట్రాల్లో భారీగా ఓపెన్ అయిన ఈ సినిమా కొన్ని చోట్ల నాన్-బాహుబలి రికార్డులు సెట్ చేసింది.

నైజాంలో 3వందలకు పైగా థియేటర్లలో విడుదలైంది అరవింద సమేత సినిమా. తొలి రోజు ఒక్క నైజాం నుంచే ఈ సినిమాకు 5 కోట్ల 73 లక్షల రూపాయలు వచ్చాయి. అలా నైజాంలో నాన్-బాహుబలి రికార్డు క్రియేట్ చేశాడు యంగ్ టైగర్.

నైజాంతో పాటు గుంటూరు, సీడెడ్ లో కూడా అన్ని రికార్డులు బద్దలయ్యాయి. నాన్-బాహుబలి రికార్డులు క్రియేట్ అయ్యాయి. ఏపీ అంతటా ప్రతి రోజు అదనంగా 2 షోలు వేసుకునేందుకు స్పెషల్ పర్మిషన్ ఇచ్చింది ప్రభుత్వం. దీంతో భారీ వసూళ్లు వస్తాయని ట్రేడ్ ఎక్స్ పెక్ట్ చేసింది. ఆ అంచనాలకు తగ్గట్టే సీడెడ్, ఉత్తరాంధ్ర, గుంటూరులో అరవింద సమేత సినిమా వసూళ్ల మోత మోగించింది.

ఏపీ, నైజాం ఫస్ట్ డే షేర్
నైజాం – రూ. 5.73 కోట్లు
సీడెడ్ – రూ. 5.48 కోట్లు
ఉత్తరాంధ్ర – రూ. 3.12 కోట్లు
ఈస్ట్ – రూ. 2.77 కోట్లు
వెస్ట్ – రూ. 2.37 కోట్లు
గుంటూరు – రూ. 4.14 కోట్లు
కృష్ణా – రూ. 1.97 కోట్లు
నెల్లూరు – రూ. 1.06 కోట్లు