త్రివిక్రమ్ పై ‘అరవింద సమేత’ ఇంపాక్ట్

Saturday,April 20,2019 - 10:02 by Z_CLU

త్రివిక్రమ్ సినిమాలు వేరు.. అరవింద సమేత వేరు. NTR లాంటి స్టార్ హీరోతో పెద్ద ప్రయోగమే చేశాడు ఈ మాటల మాంత్రికుడు. ఏకంగా అక్లైమాక్స్ లో ఉండాల్సిన స్టాఫ్ తో సినిమాని స్టార్ట్ చేసి సినిమా ఫార్మాట్ ని తిరగ రాశాడు. దానికి మరింత సొగసుగా రాయలసీమ సొగసును అద్దాడు. అదంతా ఓకె… మరి ఇప్పుడు ఏం చేయబోతున్నాడు.

NTR తరవాత ఇప్పుడు చేతిలో బన్ని ఉన్నాడు. ఈక్వల్ స్టాండర్డ్స్.. స్టామినా ఉన్న హీరో. అయితే ఈ సారి త్రివిక్రమ్ ఏం చేయబోతున్నాడు. గతంలో ఈ కాంబినేషన్ లో జులాయి, S/o సత్యమూర్తి సినిమాలొచ్చాయి. అయితే ఈ సారి కూడా అదే ఫార్మాట్ లో సినిమా చేయబోతున్నాడా..? లేకపోతే అరవింద సమేత రూట్లో వెళ్ళే ఆలోచనలో ఉన్నాడా..?

ఓ రకంగా చెప్పాలంటే త్రివిక్రమ్ అరవింద సమేత రూట్ కే స్టిక్కయినట్టు తెలుస్తుంది. ఈ సినిమా కూడా అన్ని రకాలుగా కొత్తగా ఉండబోతుందనే సూచనలే అందుతున్నాయి. ఈ సారి కూడా అరవింద సమేత స్టాండర్డ్స్ ని ఆల్మోస్ట్ రీచ్ అవ్వాలనే టార్గెట్ పెట్టుకున్నాడు త్రివిక్రమ్.

లేటెస్ట్ గా అందిన ఇన్ఫర్మేషన్ ప్రకారం, ఈ సినిమాలో హీరో తండ్రి అబద్ధాలు ఆడుతుంటాడట. వాటిని కొడుకు నిజం చేస్తుంటాడట. అదే ఈ సినిమా మెయిన్ కాన్సెప్ట్. దీనికి అడిషనల్ గా బన్ని మార్క్ ఎంటర్టైనింగ్ ఎలిమెంట్స్ ఎలాగూ గట్టిగానే ప్లాన్ చేసుకుంటాడు త్రివిక్రమ్ అందులో అనుమానం లేదు.

జస్ట్ కాన్సెప్టే ఇంత కొత్తగా ఉంటే, త్రివిక్రమ్ కాస్త గట్టిగా ఫోకస్ పెట్టాడంటే స్క్రీన్ ప్లే విషయంలో క్వశ్చన్ వేయడానికి కూడా ఉండదు. దానికి తోడు తన మార్క్ డైలాగ్స్ ఉండనే ఉంటాయి. దీన్ని బట్టి చూస్తే త్రివిక్రమ్ నెక్స్ట్ సినిమాపై అరవిందసమేత ఇంపాక్ట్ ఉండబోతుందనే అనిపిస్తుంది. ఈ సినిమా సక్సెస్ ఇచ్చిన జోష్, పాత ఫార్మాట్ ని కంప్లీట్ క్లోజ్ చేసి, కొత్తగా ఏదో చేసే ప్రయత్నం చేస్తున్నాడు తివిక్రమ్.