బాహుబలి లొకేషన్ లో పవన్ కల్యాణ్

Tuesday,July 04,2017 - 12:11 by Z_CLU

పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్ సినిమా ఫాస్ట్ పేజ్ లో షూటింగ్ జరుపుకుంటుంది. రీసెంట్ గా సారథి స్టూడియోస్ లోని కెఫే సెట్స్ లో సినిమాకి సంబంధించిన కీలక సన్నివేశాలను తెరకెక్కించిన సినిమా యూనిట్, ప్రస్తుతం రామోజీ ఫిల్మ్ సిటీలో షూటింగ్ జరుపుకుంటుంది. ఈ షెడ్యూల్ తరవాత ఇమ్మీడియట్ గా బల్గేరియాకి బయలుదేరనుంది సినిమా యూనిట్. ఇంతకుముందు బాహుబలి-1 షూటింగ్ ఇక్కడే జరిగింది.

 

పవన్ కళ్యాణ్ త్రివిక్రమ్ సినిమా అనగానే పవర్ ప్యాక్డ్ ఇమోషన్స్ గ్యారంటీ అని ఎక్స్ పెక్ట్ చేస్తారు ఫ్యాన్స్. దాంతోపాటు ఈ సినిమా క్లైమాక్స్ కూడా ‘అత్తారింటికి దారేది’ తరహాలో ఉండబోతుడనే టాక్, సినిమాపై స్పెషల్ ఇంటరెస్ట్ ని క్రియేట్ చేస్తుంది.  ఈ సినిమాకి అనిరుద్ మ్యూజిక్ కంపోజ్ చేస్తున్న ఈ సినిమాలో ఖుష్బూ కీ రోల్ ప్లే చేస్తుంది. కీర్తి సురేష్, అనూ ఇమ్మాన్యువెల్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు.