అమెరికాలో బన్ని ఏం చేయబోతున్నాడు..?

Wednesday,March 21,2018 - 02:50 by Z_CLU

ప్రస్తుతం అమెరికాలో ‘నా పేరు సూర్య’ సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నాడు అల్లు అర్జున్. ప్రస్తుతం అల్లు అర్జున్, అనూ ఇమ్మాన్యువెల్ కాంబినేషన్ లో రొమాంటిక్ డ్యూయెట్ తెరకెక్కుతుంది. ఈ షెడ్యూల్ తో టోటల్ షూట్ కంప్లీట్ అవుతుంది. మరోవైపు సైమల్టేనియస్ గా పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. 

భారీ స్థాయిలో క్యూరాసిటీ రేజ్ చేస్తున్న ఈ సినిమా, ఏప్రిల్ ఫస్ట్ వీక్ నుండి ప్రమోషన్ ప్రాసెస్ స్పీడ్ పెంచనుంది. ఇప్పటికే ఫస్ట్ ఇంపాక్ట్ తో పాటు, 2 సింగిల్స్ తో సినిమా స్టాండర్డ్స్ ని ఎలివేట్ చేసిన సినిమా యూనిట్, సినిమాని డిఫెరెంట్ గా ప్రమోట్ చేసే ఆలోచనలో ఉంది.

అల్లు అర్జున్ మిలిటరీ ఆఫీసర్ గా నటిస్తున్న ఈ సినిమాకి వక్కంతం వంశీ డైరెక్టర్. శరత్ కుమార్, యాక్షన్ కింగ్ అర్జున్ కీ రోల్ ప్లే చేస్తున్న ఈ సినిమాకి విశాల్ & శేఖర్ మ్యూజిక్ కంపోజర్స్. ఈ సినిమా మే 4 న గ్రాండ్ గా రిలీజ్ కానుంది.