ఇంతకీ త్రివిక్రమ్ మైండ్ లో ఏం నడుస్తుంది..?

Friday,February 03,2017 - 09:04 by Z_CLU

అ..ఆ… సినిమా తరవాత ఇంకా ఏ సినిమాని సెట్స్ పైకి తీసుకురాలేదు త్రివిక్రమ్. పవర్ స్టార్ ‘కాటమ రాయుడు’ సినిమాకి ప్యాకప్ చెప్పీ చెప్పగానే, సెట్స్ పైకి రావాలనే ఆలోచనలో ఉన్న త్రివిక్రమ్, మ్యాగ్జిమం ప్రీ ప్రొడక్షన్ పనులకు శుభం కార్డు వేసి మరీ వెయిట్ చేస్తున్నాడు.

నిజానికి మాటల మాంత్రికుని డైరీలో ఆల్ రెడీ 2017 పేజీలన్నీ నిండిపోయి ఉన్నాయి. పవర్ స్టార్ సినిమా తరవాత NTR 28 సినిమా చేసే ప్లాన్ లో ఉన్న త్రివిక్రమ్, ఈ సినిమా రిలీజ్ తరవాత మహేష్ బాబు 26 సినిమాతో సెట్స్ పై ఉండాలి. ఇదీ త్రివిక్రమ్ కరియర్ షెడ్యూల్.

Trivikram Srinivas, Pawan Kalyan at Attarintiki Daredi Movie Audio Release Function Stills

కానీ నిన్న T. సుబ్బరామిరెడ్డి అనౌన్స్ చేసిన మెగా మల్టీస్టారర్, టాలీవుడ్ లో మెగా వైబ్రేషన్స్ నే క్రియేట్ చేసింది. ఇప్పటి వరకు కేవలం డ్రీమ్స్ కే సొంతమైన ఈ కాంబో సెట్స్ పైకి వస్తుందనగానే మెగా ఫ్యాన్స్ కి ఫెస్టివల్ సీజన్ బిగిన్ అయిపోయింది.

ఇంత హడావిడిలోనూ రేజ్ అయ్యే క్వశ్చన్ ఏమిటంటే ఈ మెగా మల్టీస్టారర్ ని త్రివిక్రమ్ ఏ సినిమా తరవాత చేస్తాడు..? ఆల్ రెడీ రాసిపెట్టుకున్న సినిమా లిస్టులో ఈ సినిమాని ఏ ప్లేసులో పెడతాడు..? ఈ క్వశ్చన్ కి ఆన్సర్ తెలియాలంటే ఈ సినిమా యూనిట్ నుండి మరో అనౌన్స్ మెంట్ బయటికి రావాల్సిందే.