త్రివిక్రమ్ రాసుకున్న మరో పవర్ ఫుల్ రోల్

Monday,May 06,2019 - 10:03 by Z_CLU

హీరోయిన్ మదర్ రోల్ అయినా, మేనత్త రోల్ అయినా అప్పటివరకు తెలుగు సినిమాకి సపోర్టింగ్ క్యారెక్టర్ మాత్రమే. సినిమాని నడిపించేది జస్ట్ యంగ్ క్యారెక్టర్సే. కానీ ఆ ఆచారాన్ని త్రివిక్రమ్ తిరగరాశాడు. సినిమాలో హీరోయిన్ కన్నా ఈ క్యారెక్టర్స్ ని మరింత పవర్ ఫుల్ గా ప్రెజెంట్ చేశాడు. ఇప్పుడీ వరసలో టబు కూడా చేరింది.

అల్లు అర్జున్ కొత్త సినిమా : కథలో  అత్తగానో, అమ్మగానో ఒక క్యారెక్టర్ పడింది అంటే త్రివిక్రమ్ ఆ క్యారెక్టర్ స్థాయిని ఎక్కడో నిలబెట్టేస్తాడు. అందుకే త్రివిక్రమ్ సినిమాలో ఇలాంటి అవకాశం దక్కించుకోవడానికి ఎందరో సీనియర్ హీరోయిన్స్ వెయిట్ చేస్తుంటారు.. అయితే ఈసారి అవకాశం మాత్రం టబుకి దక్కింది.

అత్తారింటికి దారేది : ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ రోల్ ని ఎంత ఎట్రాక్టివ్ గా చూపించాడో, హీరో మేనత్త రోల్ ని కూడా అంతే అందంగా చూపించాడు త్రివిక్రమ్. ఏకంగా టైటిల్ కూడా ఆ క్యారెక్టర్ కి రిలేటెడ్ గా ఫిక్స్ చేశాడు. దానికి తోడు కథ మొత్తం ఆమె చుట్టే తిరిగేలా ప్లాన్ చేసి, ఆ కండిషన్స్ మధ్య కూడా హీరో క్యారెక్టర్ ని ఎక్కడా తగ్గకుండా సినిమా తీసి సక్సెస్ కొట్టాడు. ఈ క్యారెక్టర్ లో నదియా నటించింది.

అ..ఆ: ఈ సినిమాలో కూడా అవకాశం నదియాకే దక్కింది. సమంతాకి మదర్ గా, నితిన్ కి అత్తగా పర్ఫెక్ట్ అనిపించుకుంది. ఇక్కడ కూడా అంతే.. కథ మొదలయ్యేది హీరో అత్త వల్లే… క్లోజ్ అయ్యేది కూడా అత్త మనసు మార్చుకోవడం వల్లే.

అజ్ఞాతవాసి: ఈ సినిమా వరకు వచ్చేసరికి క్యారెక్టర్ ని ‘పిన్ని’ కి షిఫ్ట్ చేశాడు. కానీ క్యారెక్టరైజేషన్ లో మాత్రం అస్సలు తన మార్క్  తగ్గకుండా చూసుకున్నాడు. ఈ సినిమాలో ఈ పాత్రలో  ఖుష్బూ నటించింది.

 

అరవింద సమేత : ఈ సినిమాలో నానమ్మగా నటించిన  సుప్రియా పాఠక్  పాత్ర కూడా అలాంటిదే. ఈ క్యారెక్టర్ గట్టిగా మాట్లాడేది అక్కడక్కడే అయినా, హీరో రోల్ పై ఇంపాక్ట్ క్రియేట్ చేసేలా ప్లాన్ చేశాడు త్రివిక్రమ్. సినిమాలో హీరోకి ఆడియెన్స్ ఎంతగా కనెక్ట్ అయ్యారో, ఈ క్యారెక్టర్ కి కూడా అదే స్థాయిలో కనెక్ట్ అయ్యారు…

ఇలా తన సినిమాల్లో హీరో పాత్రలే కాకుండా ఓ క్యారెక్టర్ ఆర్టిస్ట్ పాత్రను కూడా బలంగా చూపిస్తున్నాడు మాటల మాంత్రికుడు.