‘డియర్ కామ్రేడ్’ – ఏదైనా సడెన్ గానే...

Wednesday,March 27,2019 - 10:02 by Z_CLU

టైటిల్ లోనే బోలెడంత వైబ్రేషన్స్.. దానికి తోడు విజయ్ దేవరకొండ… ఈ సమ్మర్ ఎట్రాక్షన్ గా రాబోతున్న ఈ సినిమా గురించి ఫిల్మ్ మేకర్స్ నుంచి ఏ సందడి లేదు. చాలా సైలెంట్ గా పనులు కానిచ్చేస్తున్నారు.  ఈమధ్య కాలంలో విజయ్ దేవరకొండ నుంచి ఇంత సైలెంట్ గా వస్తున్న సినిమా ఇదే.

ఒకేసారి సైమల్టేనియస్ గా సినిమాలు చేసేయడం, సినిమా సగం షూటింగ్ ఇలా కంప్లీట్ చేసుకుంటుందో లేదో,  టీజర్.. ఆ తరవాత ట్రైలర్…, కుదిరితే సింగిల్స్… మధ్యలో ఏదైనా అకేషన్స్ లో సినిమా ప్రస్తావన తీసుకొస్తూ, ఫ్యాన్స్ లో కావాల్సినంత బజ్ తీసుకురావడం విజయ్ దేవరకొండ స్ట్రాటజీ. కానీ ‘డియర్ కామ్రేడ్’ విషయంలో మాత్రం ప్రత్యేకంగా వ్యవహరిస్తున్నాడు ఈ క్రేజీ హీరో.

రీసెంట్ గా రిలీజైన టీజర్ కూడా జస్ట్ ఈ సినిమాకి ఫ్యాన్స్ లో ఏ మాత్రం డిమాండ్ ఉందో తెలుసుకోవడానికే రిలీజ్ చేసినట్టున్నారు మేకర్స్. అది కూడా ఏ మాత్రం హడావిడి లేకుండా… సింపుల్ గా సోషల్ మీడియాలో రిలీజ్ చేసి మళ్ళీ సైలెంట్ అయిపోయారు. ఫ్యాన్స్ మాత్రం ఆ టీజర్ కి జస్ట్ నిమిషాల్లో బ్లాక్ బస్టర్ స్టేటస్ ఇచ్చేశారు.

ఏది ఏమైనా విజయ్ దేవరకొండ ఈ సినిమాతో కచ్చితంగా స్ట్రాటజీ చేంజ్ చేశాడు, అది మాత్రం కన్ఫమ్. గతంలోలా సినిమా సెట్స్ పై ఉండగానే ప్రమోషన్స్ స్టార్ట్ చేసేసి, బజ్ క్రియేట్ చేయడం లాంటివి కాకుండా, ఇలా సైలెంట్ గా ఉండి సర్ ప్రైజింగ్ ఎలిమెంట్స్ తో ప్రమోట్ చేయడమే కరెక్ట్ అని ‘డియర్ కామ్రేడ్’ టీమ్ డిసైడ్ అయిందనిపిస్తుంది.