RRR Glimpse – Rajamouli again impressed with the Content!
‘RRR‘ కి సంబంధించి రాజమౌళి భారీ ప్రమోషన్ మొదలెట్టేశాడు. రిలీజ్ కి ఇంకా రెండు నెలలే ఉండటంతో ఇప్పటినుండే ఓ రేంజ్ ప్రమోషన్స్ తో సినిమాపై ఎక్కడలేని అంచనాలు పెంచేస్తున్నాడు జక్కన్న. ఇప్పటికే పివీఆర్ ని PVRRR అని మార్చేసి వినూత్న స్థాయిలో ప్రమోషన్ చేస్తున్నారు. తాజాగా వదిలిన గ్లిమ్స్ కూడా సినిమాపై మరింత అంచనాలు పెంచేలా ఉన్నాయి. సినిమాలో కొన్ని బెస్ట్ షాట్స్ ని ఆర్డర్ లో పెట్టి ఇండియన్ సినిమా అభిమానులకు విజువల్ ట్రీట్ ఇచ్చాడు రాజమౌళి. ముఖ్యంగా తారక్ , చరణ్ లతో వచ్చే షార్ట్స్ ఏవైతే ఉన్నాయో ఆడియన్స్ కి గూస్ బంప్స్ తెప్పించేలా ఉన్నాయి. సెంథిల్ విజువల్స్ , కీరవాణి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ గ్లిమ్స్ ని నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్ళాయి. సినిమాలో తారక్ టైగర్ తో ఫైట్ చేస్తాడనే టాక్ ఉంది. గ్లిమ్స్ లో టైగర్ షాట్స్ వేసి దానిమీద కూడా క్లారిటీ ఇచ్చేశారు.
గ్లిమ్స్ మధ్యలో ‘Bringing back the Glory of INDIAN CINEMA’ అంటూ టైటిల్ వేసి ఈ సినిమాతో ఇండియన్ మూవీ లవర్స్ అందరూ మళ్ళీ థియేటర్స్ కి వచ్చి RRR ని ఎక్స్ పీరియన్స్ చేయాలని, చేస్తారని నమ్మకం వ్యక్తం చేశాడు జక్కన్న. చివర్లో 2022 జనవరి 7న రిలీజ్ అంటూ మళ్ళీ రిలీజ్ డేట్ గుర్తుచేశారు.
డైలాగ్స్ లేకుండా కేవలం బెస్ట్ షాట్స్ తో గ్లిమ్స్ కట్ చేసి ఒకే టీజర్ గా రిలీజ్ చేశారు. దీంతో ఇప్పుడు RRR కొత్త రికార్డు క్రియేట్ చేయనుందనే ప్రచారం మొదలైంది. నిజానికి రాజమౌళి టార్గెట్ కూడా అదే. ఈ గ్లిమ్స్ తో ప్రపంచ వ్యాప్తంగా ఓ క్రేజీ రికార్డు కొట్టాలని భావిస్తున్నాడు. ఏదేమైనా అదిరిపోయే విజువల్స్ తో ‘సినిమాలో ఇంకా చాలా ప్లాన్ చేశాను మీరు వచ్చేయండి బ్రదర్’ అన్నట్టుగా గ్లిమ్స్ రిలీజ్ చేసి హింట్ ఇచ్చాడు రాజమౌళి. మరి అన్ని భాషల్లో కాకుండా అన్నిటికి ఒకే గ్లిమ్స్ వదిలిన రాజమౌళి దీంతో ఎలాంటి రికార్డు కొడతాడో చూడాలి.
Follow Us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending stories, Gossips, Actress Photos and Special topics