‘అంధగాడు’ సినిమా దాసరికే అంకితం

Wednesday,May 31,2017 - 02:03 by Z_CLU

తెలుగు సినీ పరిశ్రమ తీరని దిగ్భ్రాంతిలో ఉంది. 151 సినిమాలకు దర్శకత్వం వహించి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డుకెక్కిన దర్శక రత్న ఇకలేరు అన్న వార్త సినీ లోకాన్ని దుఃఖ సాగరంలో ముంచేసింది. చిన్న సినిమా, పెద్దసినిమా అని తేడా లేకుండా ప్రతి సినిమా ఆడాలి అని కోరుకునే దాసరి నారాయణ రావు AK ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ లో ఏ సినిమా వచ్చినా, మేకింగ్ దగ్గరి నుండి మార్కెటింగ్ దగ్గరి వరకు సలహాలిస్తూనే ఉండేవారు. అందుకే  జూన్ 2 న రిలీజ్ కానున్న తమ చిత్రం ‘అంధగాడు’ సినిమాని గురువు గారు దాసరి నారాయణ రావు గారికి అంకితమిస్తుంది సినిమా యూనిట్.