నో బర్త్ డే సెలెబ్రేషన్స్

Wednesday,May 31,2017 - 03:02 by Z_CLU

తెలుగు సినిమాకు తలమానికం లాంటి దర్శకుడు దాసరి నారాయణ రావు గారి మరణంతో ఈ రోజు తెలుగు సినిమా పరిశ్రమ ఇప్పటికే సెలవు ప్రకటించేసింది. దాంతో షూటింగ్స్, థియేటర్సే కాదు, సంబరాలు జరుపుకోవడం కూడా మానేసింది టాలీవుడ్.

ఈ రోజు సూపర్ స్టార్ కృష్ణ సందర్భంగా అటు ఫ్యాన్స్, ఇటు కుటుంబ సభ్యులు భారీగా సెలెబ్రేషన్స్ ప్లాన్ చేసుకున్నారు. ఆయన బర్త్ డే సందర్భంగా మహేష్ బాబు ‘స్పైడర్’ టీజర్ కూడా ఇవ్వాలే రిలీజ్ ప్లాన్ చేసుకుంది సినిమా యూనిట్. కానీ అంతలో ఈ విషాదం జరగడంతో సెలెబ్రేషన్స్ క్యాన్సిల్ చేసేశాడు సూపర్ స్టార్. దాంతో ‘స్పైడర్’ టీజర్ రిలీజ్ కూడా రేపటికి పోస్ట్ పోన్ అయింది.