ఇక పై ఆ అభినందనలుండవు

Wednesday,May 31,2017 - 01:19 by Z_CLU

తెలుగు సినిమా పరిశ్రమలో ఒక సినిమా బాగుందంటే, మంచి కలెక్షన్స్ తో రన్ అవుతుందంటే ఆ సినిమా యూనిట్ ను పిలిచి మరీ మీడియా ముందు అభినందించి ఆ సినిమా గురించి మాట్లాడటం దర్శకరత్న దాసరి నైజం. అందుకే బాగున్న ప్రతీ సినిమా అది చిన్న దైనా పెద్దదైన దానికి దాసరి ప్రశంసలు దక్కాల్సిందే. ఆయన పిలిచి మరీ అభినందనలు అందుకున్న యూనిట్ మరెన్నో మంచి సినిమాలు తీసి మరో సారి ఆయన అభినందనలు అందుకోవాలనుకుంటారు.

దాసరి అభినందించిన తెలుగు సినిమాలెన్నో లెక్కల్లో చెప్పలేం. అందుకే దాసరి ఇక లేరని ఆయన అభినందనలు ఇక పై అందుకోలేమని తెలియగానే ఆయనచే అభినందనలు అందుకున్న అందుకోవాల్సిన వారందరి గొంతు మూగబోయాయి. దాసరి అంటే అభినందన, అభినందన అంటే దాసరి అనేట్టుగా టాలీవుడ్ లో పేరు గాంచారు దాసరి నారాయణ రావు.. ఏదేమైనా దాసరి మరణం తెలుగు చిత్ర పరిశ్రమకు తీరని లోటు.