RRR - భారీ ప్రాజెక్టులోకి అమీర్ ఖాన్

Tuesday,November 24,2020 - 05:24 by Z_CLU

ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా రాబోతున్న RRR సినిమాకు సంబంధించి మరో క్రేజీ అప్ డేట్ వచ్చేసింది. ఈ సినిమాలోకి అమీర్ ఖాన్ కూడా వచ్చి చేరాడు. అయితే సినిమాలో అమీర్ కనిపించడు, వినిపిస్తాడు. అవును.. అమీర్ ఈ సినిమాకు వాయిస్ ఓవర్ అందించబోతున్నాడు.

ఆర్ఆర్ఆర్ హిందీ వెర్షన్ లో అమీర్ ఖాన్ వాయిస్ ఓవర్ వినిపిస్తుంది. ఈ సినిమాలో ఎన్టీఆర్, రామ్ చరణ్ పాత్రలకు ఇంట్రడక్షన్ ఇచ్చేది ఇతడే. అంతేకాదు.. సినిమాలో మరికొన్ని కీలక సన్నివేశాల దగ్గర కూడా అమీర్ వాయిస్ ఓవర్ ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది.

amir khan voice over RRR

అమీర్ తో సినిమా చేయడం రాజమౌళి కలల్లో ఒకటి. హిందీలో తను సినిమా తీస్తే అమీర్ ఖాన్ తోనే బాలీవుడ్ జర్నీ స్టార్ట్ చేస్తానని గతంలో ప్రకటించాడు జక్కన్న. ఇప్పుడు ఆర్ఆర్ఆర్ లోకి అమీర్ ను తీసుకొచ్చాడు.

ఈ సినిమాలో ఓ కీలకపాత్రలో అజయ్ దేవగన్ నటిస్తున్నాడు. ఇప్పుడు అమీర్ రాకతో ఆర్ఆర్ఆర్ రేంజ్ మరింత పెరిగింది.

Also Check – RRR స్టిల్స్