రాజమౌళి

Friday,November 13,2020 - 04:13 by Z_CLU

కోడూరి శ్రీ శైల రాజమౌళి ప్రముఖ దర్శకుడు. అక్టోబర్ 10 , 1973 లో జన్మించారు. తొలుత ప్రముఖ దర్శకుడు రాఘవేంద్రరావు దగ్గర తెలుగు సీరియల్స్ కు అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేశారు. ఎన్టీఆర్ కథానాయకుడిగా తెరకెక్కిన ‘స్టూడెంట్ నంబర్ 1 ‘ చిత్రం తో తెలుగు చిత్ర పరిశ్రమకు దర్శకుడిగా పరిచయం అయ్యారు. ఈ చిత్రం తో దర్శకుడిగా గుర్తింపు తో పాటు విజయం అందుకున్నారు రాజమౌళి.

ఈ చిత్రం తరువాత మరో సారి ఎన్టీఆర్ కథానాయకుడిగా రూపొందించిన ‘సింహాద్రి’ చిత్రం తో ఘన విజయం అందుకున్నారు. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్ వసూళ్లు చేసి టాలీవుడ్ గ్రాండ్ హిట్స్ లో ఒకటిగా  నిలిచింది. ఈ చిత్రం తర్వాత ‘సై’, ‘ఛత్రపతి, ‘విక్రమార్కుడు’, ‘యమదొంగ’ వంటి చిత్రాలతో విజయాలు అందుకున్నారు.

రామ్ చరణ్ కథానాయకుడిగా తెరకెక్కిన ‘మగధీర’ చిత్రం తో గ్రాండ్ హిట్ అందుకున్నారు. ఈ చిత్రం టాలీవుడ్ లో తొలి 50 కోట్ల మార్క్ దాటిన చిత్రం గా నిలిచింది. ఈ చిత్రం తర్వాత సునీల్ కథానాయకుడిగా ‘మర్యాద రామన్న’, నాని కథానాయకుడిగా ‘ఈగ’ చిత్రాలను తెరకెక్కించి విజయాలు అందుకున్న రాజమౌళి ప్రభాస్ కథానాయకుడిగా తెరకెక్కిన ‘బాహుబలి’ చిత్రంతో కెరీర్ లో గ్రాండ్ హిట్ అందుకోవడం తో పాటు ప్రపంచవ్యాప్తంగా గొప్ప గుర్తింపు అందుకున్నారు..

ఈ చిత్రానికి బెస్ట్ ఫీచర్ ఫీల్ కేటగిరి లో నేషనల్ అవార్డు దక్కింది. రాజమౌళి దర్శకుడిగా 2016 సంవత్సరంలో  ‘పద్మశ్రీ’ అవార్డు అందుకున్నారు. రాజమౌళి దర్శకుడిగా మూడు ఫిలిం ఫెర్ అవార్డులతో పాటు నంది స్టేట్ అవార్డు ను అలాగే పలు గౌరవాత్మక పురస్కారాలను, అవార్డులను అందుకున్నారు. ‘బాహుబలి’ చిత్రానికి కొనసాగింపు గా ‘బాహుబలి ది కంక్లూజన్’ చిత్రాన్ని తీశారు రాజమౌళి. టాలీవుడ్ లోనే కాదు, ఇండియాలోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది ఆ సినిమా.

ప్రస్తుతం ఈ దర్శకధీరుడు రామ్ చరణ్, ఎన్టీఆర్ హీరోలుగా RRR మూవీని తెరకెక్కిస్తున్నాడు.

సంబంధిత వార్తలు