జూన్ 1న విడుదలకానున్న "అమీ తుమీ"

Monday,May 08,2017 - 10:12 by Z_CLU

గ్రీన్ ట్రీ ప్రొడక్షన్స్ పతాకంపై అవసరాల శ్రీనివాస్-అడివి శేష్ హీరోలుగా ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న మల్టీస్టారర్ “అమీ తుమీ”. వెన్నెలకిషోర్ ఓ ముఖ్యపాత్ర పోషిస్తున్న ఈ చిత్రాన్ని జూన్ 1న విడుదల చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. కహాన్-కన్నవ్ సమర్పణలో కె.సి.నరసింహారావు నిర్మిస్తున్న ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు చివరిదశకు చేరుకొన్నాయి.

అమీతుమీ టీజర్ కు ఇప్పటికే మంచి రెస్పాన్స్ వచ్చింది. అలాగే మే 10న సినిమాలోని మొదటి పాట “అయ్యా బాబోయ్” విడుదల కానుంది. మణిశర్మ సంగీతం అందించారు. పాటలన్నింటినీ ఆన్ లైన్ లోనే విడుదల చేసి.. ప్రీ-రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించబోతున్నారు.

ఈషా, అదితి మ్యాకల్ ఈ సినిమాలో హీరోయిన్లుగా నటించారు. జెంటిల్ మేన్ లాంటి హిట్ మూవీ తర్వాత మోహనకృష్ణ డైరక్ట్ చేస్తున్న సినిమా ఇది. అందుకే మూవీపై అంచనాలు పెరిగాయి.