జీ సినిమాలు ( 8th మే )

Sunday,May 07,2017 - 10:04 by Z_CLU

నటీనటులు : నిశ్చల్, వందన, R.P. పట్నాయక్

ఇతర నటీనటులు : బ్రహ్మానందం, దువ్వాసి మోహన్, అనిత చౌదరి

మ్యూజిక్ డైరెక్టర్ : R.P. పట్నాయక్

డైరెక్టర్ : R.P. పట్నాయక్

ప్రొడ్యూసర్ : R.P. పట్నాయక్

రిలీజ్ డేట్ : 11 మార్చి 2016

 ఫార్ములా సినిమాలకు భిన్నంగా ఉంటాయి R.P. పట్నాయక్ సినిమాలు. హారర్ థ్రిల్లర్ గా తెరకెక్కిన తులసీదళం 2016 లో రిలీజైన బెస్ట్ సినిమాలలో ఒకటి. సినిమాలో ఒక స్పెషల్ క్యారెక్టర్స్ లో నటిస్తూనే, ఈ  సినిమాకి దర్శకుడు, నిర్మాత, సంగీతం అన్ని తానాయి చూసుకున్నాడు R.P. పట్నాయక్.

==============================================================================

నటీనటులు : సురేష్, యమున

ఇతర నటీనటులు : దాసరి నారాయణ రావు, సుజాత, సురేష్, గొల్లపూడి, వేలు, రాళ్ళపల్లి, కాంతారావు, బ్రహ్మానందం, బాబూ మోహన్ తదితరులు

మ్యూజిక్ డైరెక్టర్ : వాసూ రావు

డైరెక్టర్ : దాసరి నారాయణ రావు

ప్రొడ్యూసర్ : డి. రామా నాయుడు

రిలీజ్ డేట్:  1992

కష్టపడి పెంచిన తలిదండ్రులను కన్నా బిడ్డలే పట్టించుకోకపోతే ఎలా ఉంటుందో కళ్ళకు కట్టినట్టు తెరకెక్కించారు డైరెక్టర్ దాసరి నారాయణరావు. ఈ సినిమాలో తండ్రి పాత్ర కూడా స్వయంగా ఆయనే పోషించారు. ఈ సినిమాలో ‘ఒకే ఒక ఆశ’ అంటూ సాగే పాట సినిమాకే హైలెట్ గా నిలుస్తుంది.

==============================================================================

నటీనటులు : అఖిల్ అక్కినేని, సాయేషా సైగల్

ఇతర నటీనటులు : రాజేంద్ర ప్రసాద్, బ్రహ్మానందం, సప్తగిరి, హేమ, మహేష్ మంజ్రేకర్, వెన్నెల కిషోర్ తదితరులు

మ్యూజిక్ డైరెక్టర్ : అనూప్ రూబెన్స్, S.S. తమన్

డైరెక్టర్ : V.V.వినాయక్

ప్రొడ్యూసర్ : సుధాకర్ రెడ్డి, నితిన్

రిలీజ్ డేట్ : నవంబర్ 11, 2015

అక్కినేని అఖిల్ డెబ్యూ ఫిల్మ్ అఖిల్. సాయేషా హీరోయిన్ గా నటించింది. పక్కా రొమాంటిక్ అండ్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమా, రిలీజైన అన్ని థియేటర్ లలోను  సూపర్ హిట్టయింది. సైన్స్ ఫిక్షన్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాని వి.వి. వినాయక్ దర్శకత్వం వహించాడు. అఖిల్ ఆఫ్రికాలో జాగ్వార్ తో చేసే ఫైట్ హైలెట్ గా నిలుస్తుంది.

==============================================================================

హీరోహీరోయిన్లు –వరుణ్ సందేశ్, అస్మితా సూద్

నటీనటులు –పూనమ్ కౌర్, జయప్రకాష్ రెడ్డి, బ్రహ్మానందం, కృష్ణుడు, నాగినీడు, అలీ

సంగీతం –కోటి

దర్శకత్వం –ఈశ్వర్ రెడ్డి

విడుదల తేదీ –2011, జులై 1

ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఫుల్లుగా నవ్వుకోవాలంటే బ్రహ్మిగాడి కథ చూడాల్సిందే. ఇంట్రెస్టింగ్ స్క్రీన్ ప్లేతో అందర్నీ నవ్వించేలా  తెరకెక్కింది బ్రహ్మిగాడి కథ. రాయలసీమ యాసలో జయప్రకాష్ రెడ్డి చెప్పిన డైలాగులు, తన సీనియార్టీ అంతా ఉపయోగించి బ్రహ్మానందం ఇచ్చిన ఎక్స్ ప్రెషన్స్, చేసిన కామెడీ సినిమాకు స్పెషల్  ఎట్రాక్షన్స్. వీటికి తోడు కృష్ణుడు, అలీ  కూడా నవ్విస్తారు. హీరోయిన్ అస్మితా సూద్ ఈ సినిమాతోనే హీరోయిన్ గా వెండితెరకు పరిచయమైంది.

==============================================================================

నటీనటులు – కృష్ణుడు, సోనియా

ఇతర నటీనటులు – సూర్య తేజ్, పూనమ్ కౌర్, సామ్రాట్, అంకిత, ఆదర్శ్ బాలకృష్ణ, సత్య కృష్ణన్ తదితరులు

మ్యూజిక్ డైరెక్టర్ – సామ్ ప్రసన్

నిర్మాత – ప్రేమ్ కుమార్ పట్రా

దర్శకత్వం – సాయి కిరణ్ అడివి

విడుదల తేదీ – 21 నవంబర్ 2008

కృష్ణుడు-సోనియా జంటగా సాయి కిరణ్ అడివి తెరకెకెక్కించిన యూత్ ఫుల్ ఫామిలీ ఎంటర్టైనర్ ‘వినాయకుడు’. అప్పటి వరకూ నటుడిగా కొనసాగుతున్న కృష్ణుడు ని హీరోగా చూపించి దర్శకుడు సాయి కిరణ్ రూపొందించిన ఈ సినిమా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకూ సాఫ్ట్ స్క్రీన్ ప్లే, సాఫ్ట్ సీన్స్ తో అందరినీ అలరిస్తుంది.

=============================================================================

నటీనటులు : N.T.రామారావు, జమున, అంజలి

ఇతర నటీనటులు : S.వరలక్ష్మి, L.విజయలక్ష్మి, కాంతారావు, రాజనాల, పద్మనాభం, వాణిశ్రీ

మ్యూజిక్ డైరెక్టర్ : పెండ్యాల

డైరెక్టర్ : K. కామేశ్వర రావు

ప్రొడ్యూసర్ : రామా నాయుడు

రిలీజ్ డేట్ : 1966

NTR కరియర్ లోని పౌరాణిక సినిమాల్లో ఒక ఆణిముత్యం శ్రీ కృష్ణ తులాభారం.. శ్రీకృష్ణుడు తన భార్యల మధ్య అపురూప సన్నివేశాలతో అద్భుతంగా తెరకెక్కిందే శ్రీ కృష్ణ తులాభారం. పెండ్యాల సంగీతం అందించిన ఈ సినిమాకి K.కామేశ్వర రావు డైరెక్షన్ చేశారు.