అమెరికాలో వంద కోట్ల వసూళ్లు

Monday,May 08,2017 - 10:28 by Z_CLU

రోజుకో రికార్డుతో దూసుకుపోతున్న బాహుబలి-2 సినిమా ఇప్పుడు మరో రికార్డు సృష్టించింది. అమెరికాలో ఈ సినిమాకు వంద కోట్ల రూపాయల గ్రాస్ వచ్చింది. ఓ ఇండియన్ సినిమాకు ఉత్తర అమెరికా, కెనడా దేశాల్లో వంద కోట్ల రూపాయల వసూళ్లు రావడం ఓ పెద్ద రికార్డు. ఇప్పటివరకు బాలీవుడ్ సినిమాకు కూడా సాధ్యం కాని ఫీట్ ఇది.

బాహుబలి – ది కంక్లూజన్ సినిమా ఇప్పటికే వెయ్యి కోట్ల రూపాయల క్లబ్ లోకి ఎంటరైంది. ఇప్పుడు ఉత్తర అమెరికాలో వంద కోట్ల రూపాయల గ్రాస్ సాధించి, హాలీవుడ్ సినిమాకు పోటీగా నిలిచింది. ఈ సినిమా సాధిస్తున్న వసూళ్లు, హాలీవుడ్ క్రిటిక్స్ ను సైతం ఆశ్చర్యానికి గురిచేస్తోంది. బీబీసీ, సీఎన్ఎన్, ఎబీసీ లాంటి ప్రముఖ వార్తా సంస్థలు బాహుబలి-2పై ప్రత్యేక కథనాలు ప్రసారం చేస్తున్నాయి.

త్వరలోనే బాహుబలి-2 సినిమా మరిన్ని వసూళ్లు, రికార్డులు సాధించనుంది. ఎందుకంటే, ఈ వీకెండ్ నుంచి ఓవర్సీస్ లో ఈ సినిమాకు మరిన్ని షోలు పెంచుతున్నారు. ఈ శుక్రవారం ఓవర్సీస్ లో బాహుబలి-2 మలయాళం వెర్షన్ కూడా రిలీజ్ చేస్తున్నారు.