రారండోయ్ స్పెషల్ ఎట్రాక్షన్స్

Thursday,May 25,2017 - 10:59 by Z_CLU

అక్కినేని నాగచైతన్య-రకుల్ ప్రీత్ జంటగా కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో నాగార్జున నిర్మించిన లవ్ & ఫ్యామిలీ ఎంటర్టైనర్ ‘రారండోయ్ వేడుక చూద్దాం’. శుక్రవారం రిలీజ్ అవుతున్న ఈ సినిమాలో స్పెషల్ ఎట్రాక్షన్స్ చూద్దాం


రారండోయ్ వేడుక చూద్దాం లో మొదటి ఎట్రాక్షన్ నాగచైతన్యే. ఇప్పటికే ఫస్ట్ లుక్ పోస్టర్స్, టీజర్, ట్రైలర్ లో తన లుక్ తో ఎట్రాక్ట్ చేస్తూ తన నటనతో సినిమాపై అంచనాలు పెంచేశాడు చైతు. ఓ వైపు లవ్ సీన్స్ లో లవర్ బాయ్ గా అదరగొడుతూనే మరోవైపు సెంటిమెంట్ సీన్స్, ఫైట్స్ తో సూపర్ అనిపించుకుంటున్నాడు.


ఈ సినిమాకు మరో ఎట్రాక్షన్ రకుల్ ప్రీత్. ఇప్పటివరకూ కనిపించని సరికొత్త పల్లెటూరి లుక్ తో ట్రైలర్ లో భ్రమరాంబ గా మెస్మరైజ్ చేసిన ఈ భామ సినిమాకు మెయిన్ హైలైట్ గా నిలుస్తుందంటున్నారు యూనిట్.

దేవిశ్రీ ప్రసాద్ అందించిన మ్యూజిక్ ఈ సినిమాకు మరో స్పెషల్ ఎట్రాక్షన్. ఇప్పటికే తన సాంగ్స్ తో సినిమాపై భారీ హైప్ తీసుకొచ్చిన దేవి.. సాంగ్స్ తో పాటు బ్యాగ్రౌండ్ స్కోర్ తో కూడా మెస్మరైజ్ చేసి సినిమాకు హైలైట్ గా నిలవనున్నాడు.


ఏ లవ్ స్టోరీకైనా హీరో హీరోయిన్ మధ్య కెమిస్ట్రీ వర్కౌట్ అయితే చాలు. ఆటోమేటిక్ గా ఆడియన్స్ ఎంటర్టైన్ అయిపోతారు. అలాంటి కెమిస్ట్రీ తోనే రేపు థియేటర్స్ లో ఆడియన్స్ ను ఎట్రాక్ట్ చేసి ఎంటర్టైన్ చేయబోతున్నారు చైతు-రకుల్. ఇప్పటికే ట్రైలర్ లో వీరిద్దరి కెమిస్ట్రీ కి మంచి మార్కులు పడ్డాయి. మరీముఖ్యంగా రొమాంటిక్ సీన్స్ లో చైతు-రకుల్ అదరగొట్టేస్తారట.. అంతేకాదు టాలీవుడ్ లవ్ స్టోరీస్ లో శివ-భ్రమరాంబలకు కూడా ఓ మంచి ప్లేస్ దక్కుతుందని అంటోంది యూనిట్.


అక్కినేని నాగార్జున నిర్మిస్తున్న సినిమా అంటే ప్రొడక్షన్ వాల్యూస్ చాలా రిచ్ గా ఉంటాయి. మరోసారి అలాంటి ప్రొడక్షన్ వాల్యూస్ తో ఈ సినిమాకు స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలిచాడు నిర్మాత నాగ్. అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ పై నాగార్జున నిర్మించిన ఈ సినిమాలో రిచ్ ప్రొడక్షన్ వాల్యూస్ కనిపిస్తాయి .


ఈ సినిమాకు మరో ఎట్రాక్షన్ దర్శకుడు కళ్యాణ్ కృష్ణ. మొదటి సినిమా ‘సోగ్గాడే చిన్ని నాయన’ తో గ్రాండ్ హిట్ అందుకున్న కళ్యాణ్ ఈ సినిమాను కూడా అదే స్టైల్ లో లవ్ & ఫామిలీ ఎంటర్టైనర్ గా రూపొందించాడు.


ఏ సినిమా కైనా కథే ముఖ్యం.. రారండోయ్ వేడుక చూద్దాం అనే సాఫ్ట్ టైటిల్ తో తెరకెక్కిన ఈ సినిమా కి కూడా కథే బలం అంటున్నారు మేకర్స్. అసలు ఈ సినిమా చేయడానికి మెయిన్ రీజన్ కథే అని లేటెస్ట్ గా చైతు కూడా చెప్పడంతో ఈ స్టోరీ లైన్ కచ్చితంగా అందరినీ ఎంటర్టైన్ చేస్తుందనే టాక్ వినిపిస్తుంది.


ఈ సినిమాలో మరో ఎట్రాక్షన్ యాక్షన్ పార్ట్. సినిమాలో ఫైట్స్ అక్కినేని అభిమానులతో పాటు ఆడియన్స్ ను బాగా ఎంటర్టైన్ చేస్తాయట. ఇప్పటికే ట్రైలర్ లో చైతు షర్ట్ బటన్స్ తెగే సీన్, కోపంతో పరుగెత్తుకుంటూ వచ్చే సీన్, మల్లయుద్దపు సీన్ సినిమాలో యాక్షన్ ఉందని తెలియజేస్తున్నాయి.