సెల్ఫీతో షూటింగ్ పూర్తిచేసిన బన్నీ

Thursday,April 19,2018 - 11:12 by Z_CLU

అల్లు అర్జున్ నటించిన మోస్ట్ ఎవెయిటింగ్ మూవీ నా పేరు సూర్య టోటల్ షూటింగ్ కంప్లీట్ అయింది. బన్నీ, అను ఎమ్మాన్యుయేల్ మధ్య తీసిన సాంగ్ తో ఈ సినిమా షూటింగ్ పూర్తయింది. మరోవైపు పోస్ట్ ప్రొడక్షన్ కూడా సైమల్టేనియస్ గా నడుస్తోంది. మే 4న సినిమా వరల్డ్ వైడ్ రిలీజ్ కానుంది.

షూటింగ్ ఆఖరి రోజున ఓ ఇంట్రెస్టింగ్ ఇన్సిడెంట్ ను నెటిజన్స్ తో షేర్ చేసుకున్నాడు బన్నీ. ఈ సినిమా షూటింగ్ టైమ్ లో హీరోయిన్ అను ఎమ్మాన్యుయేల్ తనను ఏమీ కోరలేదని.. షూటింగ్ ఆఖరి రోజున తను కోరిన మొదటి-ఆఖరి కోరిక ఇదేనంటూ ఓ సెల్ఫీని పోస్ట్ చేశాడు.

మరోవైపు నా పేరు సూర్య సినిమాకు సంబంధించి చాలా స్పెషల్ గా, వ్యూహాత్మకంగా ప్రమోషన్ చేస్తున్నారు. ఫస్ట్ ఇంపాక్ట్, డైలాగ్ ఇంపాక్ట్ పేరుతో ఇప్పటికే కొన్ని వీడియోలు రిలీజ్ చేసిన యూనిట్.. షూటింగ్ పూర్తవ్వడంతో ఇకపై ఈ ప్రమోషన్ ను మరింత డిఫరెంట్ గా కొనసాగించాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా మరో 3 రోజుల్లో (22న) ఈ సినిమా పాటల్ని విడుదల చేయబోతున్నారు. ఆ తర్వాత 29న ప్రీ-రిలీజ్ ఫంక్షన్ ను గ్రాండ్ గా చేయబోతున్నారు. ఇవన్నీ కొత్తగా ఉండేలా ప్లాన్ చేస్తున్నారు మేకర్స్.