మిలట్రీలో చేరబోతున్న అల్లు అర్జున్

Monday,May 07,2018 - 12:19 by Z_CLU

స్టైలిష్‌స్టార్ అల్లు అర్జున్ కథానాయకుడిగా నట విశ్వరూపం చూపించిన నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా చిత్రం భారీ కలెక్షన్స్ తో దూసుకెళ్తోంది. ఈనెల 4వ తేదీన విడుదలైన నా పేరు సూర్య చిత్రంలో సైనికుడిగా అల్లు అర్జున్ నటనకు ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు. ఇండియన్ ఆర్మీ ని ప్రధానాంశంగా తీసుకుని రూపొందించిన ఈ చిత్రాన్ని సైనికులతో కలిసి అల్లు అర్జున్ చూశాడు. ఈ చిత్రం గురించి విని సూర్య పాత్ర చేసిన అల్లు అర్జున్ ని భార‌త సైనిక కుటుంబాలు క‌లిసి రోజ్ ఫ్ల‌వ‌ర్ తో అభినందించాయి.

అల్లు అర్జున్ మాట్లాడుతూ… “నా ఇండియన్స్ అందరికి నమస్కారం. నా పేరు అల్లు అర్జున్ నా ఇల్లు ఇండియా.. ఈ చిత్రాన్ని నిజమైన మిలట్రీ ఆఫీసర్స్ మధ్య, నిజమైన ఆర్మీ క్వార్టర్లలో చిత్రీకరించాం. మా తపనకి సహకారం అందించిన భారత సైన్యానికి థ్యాంక్స్. ఇప్పటిదాకా చాలా సినిమాలు చేశాను. ఒక సినిమా విజయవంతమైతే పేరొస్తుంది, డబ్బొస్తుంది. వాటిని మించి ఈ సినిమాతో నాకు చాలా గౌరవం లభించింది. నన్ను గర్వపడేలా చేసిన సినిమా ఇదే. చిత్రీకరణ కోసం ఆర్మీ క్వార్టర్లకి వెళ్లినప్పుడే ఆ వాతావరణాన్ని, ఆ జీవితాన్ని చూసి భారత సైన్యంలో చేరాలని దరఖాస్తు చేసుకొన్నా. అధికారులు ఆమోదం తెలపగానే గౌరవ సభ్యుడిగా సైన్యంలో చేరబోతున్నా.” అన్నారు.

నిర్మాత ల‌గ‌డ‌పాటి శ్రీధ‌ర్ మాట్లాడుతూ.. రియ‌ల్ హీరోస్ మద్య‌లో చిత్రాన్ని చూడటం చాలా ఆనందంగా వుంది. మా చిత్రం విడుద‌లయ్యిన ద‌గ్గ‌ర నుండి ఆంద్ర‌ప్ర‌ధేశ్‌, తెలంగాణా లోనే కాకుండా కేర‌ళ‌, త‌మిళ‌నాడు, క‌ర్ణాట‌క రాష్ట్ర‌ల్లో అద్బుతంగా రన్ అవుతోంది. భార‌త స‌రిహ‌ద్దులో అహ‌ర్నిశ‌లు మ‌నకోసం కాపలా కాసే సైనికుడు జీవితాన్ని క‌ళ్ళ‌కు క‌ట్టిన‌ట్టుగా చూపించారు మా ద‌ర్శ‌కుడు. ఆ పాత్ర‌లో జీవించాడు మా హీరో అల్లు అర్జున్. వీరి కృషికి బ్ర‌హ్మ‌ర‌థం ప‌డుతున్నారు ప్రేక్ష‌కులు. మా బ్యాన‌ర్ లో గ‌ర్వించ‌ద‌గ్గ చిత్రం గా నిల‌బ‌డిపోతుంది.” అని అన్నారు