రేపే నా పేరు సూర్య ఆడియో రిలీజ్

Saturday,April 21,2018 - 06:02 by Z_CLU

బన్నీ నటిస్తున్న మోస్ట్ ఎవెయిటింగ్ మూవీ నా పేరు సూర్య. ఈ సినిమా ఆడియో రిలీజ్ ఫంక్షన్ ను రేపు గ్రాండ్ గా సెలబ్రేట్ చేయబోతున్నారు. బాలీవుడ్ కంపోజర్స్ విశాల్-శేఖర్ ఈ సినిమాకు సంగీతం అందించారు.

మూవీ కాన్సెప్ట్ కు తగ్గట్టే ఆడియో రిలీజ్ ను ప్లాన్ చేశారు. మిలట్రీ బ్యాక్ డ్రాప్ తో తెరకెక్కుతున్న సినిమా కాబట్టి, ఆర్మీ జవాన్లు ఎక్కువగా ఉండే మిలట్రీ మాధవరం అనే ఊరిలో ఈ సినిమా ఆడియోను సెలబ్రేట్ చేయాలని నిర్ణయించారు. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం మండలానికి చెందిన ఈ ఊరిలో ప్రతి ఇంటికి ఓ సైనికుడు ఉంటాడు.

మిలట్రీ మాధవరంలో ఇప్పటికే ఫంక్షన్ కు ఏర్పాట్లు పూర్తయ్యాయి. రేపు సాయంత్రం ఈ ఆడియో రిలీజ్ ఫంక్షన్ జరగనుంది. ఆ తర్వాత 29న హైదరాబాద్ గచ్చిబౌలిలో ప్రీ-రిలీజ్ ఫంక్షన్ నిర్వహించబోతున్నారు. సినిమాను మే 4న వరల్డ్ వైడ్ గ్రాండ్ గా విడుదల చేస్తారు.