అల్లు అర్జున్ అప్ కమింగ్ మూవీస్

Friday,July 28,2017 - 10:06 by Z_CLU

ఇటీవలే ‘డీజే’ సినిమాతో థియేటర్స్ లో సందడి చేసిన స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ప్రెజెంట్ వక్కంతం వంశీ, ‘నా పేరు సూర్య’ సినిమాను స్టార్ట్ చేసిన సంగతి తెలిసిందే. త్వరలోనే ఈ సినిమా సెట్ లో ఎంట్రీ ఇవ్వబోతున్న బన్నీ ఈ సినిమా తర్వాత మరో రెండు సినిమాలను స్టార్ట్ చేయడానికి రెడీ అవుతున్నాడట.


రచయిత నుంచి దర్శకుడిగా మారుతున్న వక్కంతం వంశీతో ‘నా పేరు సూర్య (నా ఇల్లు ఇండియా)’ అనే సినిమాను స్టార్ట్ చేసిన బన్నీ ఈ సినిమాను జెట్ స్పీడ్ లో ఫినిష్ చేయాలనీ చూస్తున్నాడు. ఈ సినిమా పొలిటికల్ డ్రామా గా తెరకెక్కనుందని, ఈ సినిమాలో బన్నీ దేశ సైనికుడిగా కనిపించనున్నాడని టాక్. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ స్టేజిలో ఉన్న ఈ సినిమాను ఆగస్టు నుంచి సెట్స్ పైకి తీసుకురానున్నాడు అల్లు అర్జున్.


వక్కంతం వంశీ సినిమా ఓ కొలిక్కి రాగానే డైరెక్టర్ విక్రమ్ కుమార్ తో ఓ సినిమాను ప్లాన్ చేస్తున్నాడట బన్నీ. ఇప్పటికే ఈ సినిమాకు స్క్రిప్ట్ వర్క్ శరవేగంగా జరుగుతుందని, వంశీ -లింగుస్వామి సినిమా గ్యాప్ లో విక్రమ్ తో బన్నీ సెట్స్ పైకి వెళ్ళబోతున్నాడని టాక్. త్వరలోనే మేకర్స్ అఫీషియల్ గా ఈ సినిమాను అనౌన్స్ చేసే ఛాన్స్ ఉందని సమాచారం.


ఇప్పటికే లింగుస్వామితో బైలింగ్వల్ సినిమాను అఫీషియల్ గా అనౌన్స్ చేసిన అల్లు అర్జున్ వచ్చే ఏడాది ఈ సినిమాను సెట్స్ పై పెట్టాలని చూస్తున్నాడట. స్టూడియో గ్రీన్ బ్యానర్ గా యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కనున్న ఈ సినిమాకు సంబంధించి ఓ వైపు శరవేగంగా ప్రీ ప్రొడక్షన్ వర్క్ కూడా జరుగుతుందని సమాచారం.