ఫోకస్ లో బన్నీ - సుకుమార్ సినిమా...

Wednesday,March 06,2019 - 10:02 by Z_CLU

బన్నీ సుకుమార్ సినిమా. ఇప్పుడు సోషల్ మీడియాలో నడుస్తున్న హాట్టెస్ట్ టాపిక్ ఇదే.  ప్రతి సినిమాలాగే ఈ సినిమా కూడా అనౌన్స్ అయితే ఇలాంటి వైబ్స్ ఉండేవి కావేమో, కానీ అటు మహేష్ బాబు సినిమా క్యాన్సిల్ అవ్వడం, ఆ ప్లేస్ ని ఈ సినిమా ఆక్యుపై చేసుకోవడంతో, న్యాచురల్ గానే వీరిద్దరిపై కంప్లీట్ ఫోకస్ పడుతుంది.

అయితే ఇక్కడ టాపిక్ ఏంటంటే సుక్కు ఏ కథైతే మహేష్ బాబుకు చెప్పాడో, అదే కథని బన్నికి చెప్పాడా..? లేకపోతే ఇది డిఫెరెంట్ కథా..? హీరో మారాడు కాబట్టి కథ కూడా మారే చాన్సెస్ ఉన్నాయా..?

గంధపు చెక్కల స్మగ్లింగ్, శేషాచలం అడవుల బ్యాక్ డ్రాప్ లో సుకుమార్ ఆల్మోస్ట్ కథ రెడీ చేసుకున్నాడు. అటు సుకుమార్ స్టైల్, ఇటు మహేష్ బాబు ఇమేజ్ లాంటి ప్రతి ఎలిమెంట్ ని మైండ్ లో పెట్టుకునే కథ రెడీ అయింది. అయితే ఇప్పుడా కథ బన్నికి షిఫ్ట్ అవుతుందా..? లేకపోతే బన్ని కోసం స్పెషల్ గా కొత్త కథేదైనా ప్లానింగ్ లో ఉందా..?

సాధారణంగా బన్ని ప్రయోగాలకెప్పుడూ ప్రయారిటీ ఇస్తూనే ఉంటాడు. ఆల్మోస్ట్ సుకుమార్ కూడా బన్ని దొరికితే, ఏదైనా కొత్తగా చేసేయాలనే ఆలోచనలోనే ఉన్నాడు. కాబట్టి గంధపు చెక్కల స్మగ్లింగ్ లాంటి రేర్ ఎటెంప్ట్ ని పక్కన పెట్టినా, డెఫ్ఫినెట్ గామరో కొత్త తరహా కథనే సెట్స్ పైకి తీసుకువస్తాడు సుకుమార్. ఏది ఏమైనా ఈ సినిమా ఇంకో అడుగు ముందుకు వేసి, డీటేల్స్ అనౌన్స్ చేస్తే కానీ, స్టోరీ విషయంలో ఏదీ ఫిక్సవ్వలేం.