Pushpa Release - బన్నీ సినిమా విడుదలపై డౌట్స్

Friday,July 16,2021 - 03:42 by Z_CLU

Doubts on Allu Arjun’s Pushpa Release

అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ‘పుష్ప’ సినిమా ప్రెజెంట్ షూటింగ్ జరుపుకుంటుంది. పార్ట్ 1 కి సంబంధించి దాదాపు షూటింగ్ పూర్తయింది. కేవలం ఇరవై రోజుల షూట్ మాత్రమే మిగిలి ఉందని సమాచారం. ఆగస్ట్ కల్లా టోటల్ షూట్ పూర్తి చేసి సినిమాను అక్టోబర్ లో రిలీజ్ చేస్తారని మొన్నటి వరకు ప్రచారం జరిగింది. అయితే దీనిపై మేకర్స్ నుండి ఇంకా ఎలాంటి క్లారిటీ రాలేదు.

తాజాగా మేకింగ్ వీడియోతో RRR ని ప్రకటించినట్టే అక్టోబర్ 13న రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు. దీంతో ఇప్పుడు పుష్ప రిలీజ్ డేట్ పై అందరిలో ఆసక్తి నెలకొంటుంది. ఒక వేళ పుష్ప 1 కూడా అక్టోబర్ లోనే రిలీజ్ చేస్తారా ? లేదా నవంబర్ కి షిఫ్ట్ చేసుకొని దీపావళి కానుకగా సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తారా ? అనేది తెలియాల్సి ఉంది. ఏదేమైనా చక చకా షూటింగ్ జరుపుకుంటూ జెట్ స్పీడ్ తో రెడీ అవుతున్న ఈ పాన్ ఇండియా సినిమా రిలీజ్ డేట్ ప్రకటించే వరకు ప్రేక్షకులకు ఈ అయోమయం తప్పదు.

AlluArjun-Pushpa-shoot-resume-soon-in-hyderabad

మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ భారీ బడ్జెట్ సినిమాను నాలుగు భాషల్లో రిలీజ్ చేయబోతున్నారు. అల్లు అర్జున్ సరసన రష్మిక హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో సునీల్ ఓ నెగిటివ్ రోల్ చేస్తున్నాడు. సునీల్ మెయిన్ విలన్ ఆ ? లేదా నెగిటివ్ ఉండే క్యారెక్టర్ ప్లే చేస్తున్నాడా ? అనేది తెలియాల్సి ఉంది. ఇక జెట్ స్పీడులో షూట్ పూర్తి చేస్తున్న బన్నీ -సుక్కు రిలీజ్ డేట్ పై క్లారిటీ ఇచ్చేదెప్పుడా ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు మూవీ లవర్స్.

  • – Follow us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending stories, Gossips, Actress Photos and Special topics