Allu Arjun Pushpa - రిలీజ్ డేట్ ఫిక్స్

Saturday,October 02,2021 - 03:15 by Z_CLU

Allu Arjun’s PUSHPA Part 1 to release on December 17

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్-క్రియేటివ్ జీనియస్ సుకుమార్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ‘పుష్ప‘ సినిమా కోసం మూవీ లవర్స్ అందరూ ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే రిలీజ్ చేసిన టీజర్, సాంగ్ సినిమాపై భారీ అంచనాలు నెలకొల్పుతున్నాయి. కొన్ని రోజుల క్రితమే క్రిస్మస్ కానుకగా సినిమాను రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించిన మేకర్స్ తాజాగా రిలీజ్ డేట్ ఎనౌన్స్ చేసి క్లారిటీ ఇచ్చేశారు. డిసెంబర్ 17న పుష్ప పార్ట్-1 థియేటర్లలోకి రాబోతోంది.

నిజానికి ఈ సినిమా షూటింగ్ ఇంకా జరుగుతుంది. యూనిట్ చేతిలో ఇంకా రెండు నెలలే ఉన్నాయి. మరి ఈ తక్కువ టైంలో మిగిలిన షూటింగ్ తో పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కూడా ఫినిష్ చేస్తారా ? అనే డౌట్ అందరిలో ఉంది. దీనిపై రిలీజ్ డేట్ పోస్టర్ తో సోషల్ మీడియా ద్వారా క్లారిటీ ఇచ్చారు నిర్మాతలు. దీంతో అనుకున్నట్లే పుష్ప డిసెంబర్ లోనే రిలీజ్ అవుతుందని అందరికీ క్లారిటీ వచ్చేసింది.

pushpa december 17 release date poster

 

బన్నీ పుష్ప రాజ్ గా నటిస్తున్న ఈ సినిమాలో రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తుంది. ఫహాద్ ఫాసిల్ , సునీల్ విలన్స్ గా నటిస్తున్న ఈ సినిమాలో రావు రమేష్, అనసూయ, జగదీశ్ (పలాస ఫేం) ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. మైత్రి మూవీ మేకర్స్ పాన్ ఇండియా లెవెల్ లో రిలీజ్ చేయనున్న ఈ సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నాడు.

ప్రస్తుతం హైదరాబాద్ లో షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా త్వరలోనే ఐటెం సాంగ్ తో టోటల్ షూటింగ్ పూర్తి చేసుకోనుంది. షూటింగ్ పూర్తయిన వెంటనే భారీ ఎత్తున ప్రమోషన్స్ స్టార్ట్ చేయబోతున్నారు.

  • – Follow us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending stories, Gossips, Actress Photos and Special topics