బన్నీ డైరెక్టర్స్ – మూడోసారి

Tuesday,April 16,2019 - 05:48 by Z_CLU

బన్ని కరియర్ లో జస్ట్ సినిమాలుండవు. ఆ సినిమాల దర్శకులు కూడా  ఉంటారు. ఒక సినిమా చేసేసి సక్సెస్ రాగానే ఇంకో డైరెక్టర్ సిన్మాతో బిజీ అవ్వడం స్టార్స్ కి మామూలే. కానీ బన్ని విషయంలో మాత్రం సినిమా రిలీజయిపోయినా, ఆ సినిమా చేసిన డైరక్టర్ మాత్రం బన్నికి సొంతమైపోతాడు.

ప్రస్తుతం త్రివిక్రమ్ సినిమాతో బిజీ కాబోతున్నాడు బన్ని. ఈ ఇద్దరి కాంబినేషన్ లో ఇది ఫస్ట్ మూవీ కాదు. ‘జులాయి’ తో బిగిన్ అయింది వీళ్ళిద్దరి జర్నీ. అక్కడితో ఆగిందా…? ఓ 4 సినిమాల గ్యాప్… అంతలో మళ్ళీ S/O సత్యమూర్తి చేశారు. మరీ బ్యాక్ టు బ్యాక్ చేసేస్తే బాగోదనుకున్నారేమో, బన్ని ఓ 3 సినిమాలు, త్రివిక్రమ్ ఓ 4 సినిమాలు   చేసి మళ్ళీ సెట్స్ పైకి వచ్చేశారు. ముచ్చటగా ఇప్పుడు మూడో సినిమా చేస్తున్నారు. ఆ మాటకొస్తే సుకుమార్ తో కూడా అంతే కదా.

సుకుమార్, బన్ని గురించి ఎంత చిన్న టాపిక్ వచ్చినా ఫస్ట్ మెన్షన్ చేయాల్సింది ‘ఆర్య’ సినిమా. ఇద్దరికీ ఇది స్పెషల్ సినిమానే. ఈ సినిమా వీళ్ళిద్దరి మధ్య ఏ స్థాయి బాండింగ్ క్రియేట్ చేసిందంటే, ‘బన్ని సుకుమార్ చిన్నగా పిలిచినా పలికేంత దూరంలో ఉంటాడా..?’ అనిపిస్తుంది. ‘ఆర్య’ తో సరిపెట్టుకోకుండా ‘ఆర్య 2’ చేశారు. పెద్దగా డీటేల్స్ బయటికి రాలేదు కానీ, 3 వ సినిమా గ్రౌండ్ వర్క్ కూడా భారీ స్థాయిలో జరుగుతుందని తెలుస్తుంది.

ఇప్పుడేదో ఆల్రెడీ అనౌన్స్ అయినా సినిమాలివి కాబట్టి ఈ ఇద్దరు ఫిల్మ్ మేకర్స్ హైలెట్ అయ్యారు కానీ, ఈ లిస్టులో  వి.వినాయక్, పూరి జగన్నాథ్ లు కూడా వస్తారు. ఇప్పటికే బన్నితో ఇద్దరూ రెండేసి సినిమాలు చేసేసి ఉన్నారు మరీ. టైమ్, కథ కలిసి రావాలి కానీ బన్ని, వీళ్ళిద్దరితో కూడా మళ్ళీ సెట్స్ పైకి రావడానికి పెద్దగా టైమ్ పట్టదు. బన్నికి డైరెక్టర్స్ తో ఉన్న బాండింగ్ అలాంటిది.